కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులను, 15వ ఆర్థిక సంఘం నిధులను గత కొద్ది నెలలుగా నిలిపివేసిందని, దీనివల్ల స్థానిక సంస్థల అభివృద్ధి కుంటుపడుతున్నదని సర్పంచుల సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును నాయకులు కలిసిశారు. రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వ వివక్ష తగదని , కేంద్ర నిధులు రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులు వచ్చేలా కేంద్రంపై వత్తిడి తేవాలని విజ్ఞప్తిచేశామన్నారు.…
గ్రామాల్లో సర్పంచులు ఆందోళన చేస్తున్నారా..? లేక ఎవరైనా చెప్పి చేయిస్తున్నారా..? తెలియడం లేదని..కొన్ని మీడియా ఛానెళ్లు, వార్తా పత్రికల్లో వార్తలు వస్తున్నాయని, నిన్నటి వరకు అందరి బిల్లులను క్లియర్ చేశామని వెల్లడించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పల్లె ప్రగతి ఈ నెల 3 నుంచి 17 వరకు అన్ని గ్రామాల్లో జరుగుతుందని అన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్లు, మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఉపాధి హామీ పనులు మన రాష్ట్రంలో…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గట్టి కౌంటర్లిచ్చారు. అవగాహన లేకుండా, చరిత్ర తెలియకుండా, మోదీ చేసిన వ్యాఖ్యలు.. ఆయన పదవికి తగ్గట్టుగా లేవన్నారు. మోదీకి కుటుంబం లేదని, అందువల్లే ఆయనకు సెంటిమెంట్లు తెలియవని అన్నారు. సీఎం కేసిఆర్‌ది కుటుంబ పాలన కాదని చెప్పిన ఎర్రబెల్లి.. తెలంగాణ కోసం ఆయన కుటుంబం ఉద్యమించి, జైళ్ళకు పోయి, త్యాగాలు చేసిందన్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వారిని…
నాకు నచ్చిన ముఖ్యమంత్రులు సీనియర్ ఎన్టీఆర్, సీఎం కేసీఆర్ అని తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ రైతులను మభ్యపెట్టేందుకే అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో వారి డిక్లరేషన్ అమలు కావడం లేదని విమర్శలు చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ఏ పంట వేస్తే లాభం జరుగుతుందో ఆలోచించి సాగు చేయాలని.. వరి మినహా ఇతర పంటలు సాగు చేసిన వారు లాభాలు…
వరంగల్ ఎంజీఎం పరిసరాలను,ఆర్ఐసీయూ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,డీఎంఈ రమేష్ రెడ్డి. శ్రీనివాస్ కు చాలా సమస్యలు ఉన్నాయి. పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. హాస్పిటల్ ఘటనకు బాధ్యులపై రిపోర్ట్ మేరకు మంత్రి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు. మంత్రి హరీష్ రావు పొద్దున్నే మాట్లాడారు విజిట్ చేయమని చెప్పారన్నారు మంత్రి ఎర్రబెల్లి. ఎలుకలు కొరుక్కుతినడం మా నిర్లక్షమే..మేము కాదనడం లేదన్నారు. ఎంజీఎంలో డ్రైనేజీ ఇబ్బంది ఉంది. అండర్…
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పాలకుర్తి ప్రభుత్వాస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్‌లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో మార్చి తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజలకు ఉచిత విద్య, ఉచిత వైద్యం అంచాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి ప్రకటించారు. దాని కోసం సాధ్యాసాధ్యాలను కేసీఆర్ పరిశీలిస్తున్నారని తెలిపారు. అటు దళిత…
నేడు సీఎం కేసీఆర్ జనగామ జిల్లాలో కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏడేళ్ల నుండి కేంద్రంతో ఏమైనా పంచాయితీ పెట్టుకున్నమా, నోరు కట్టుకొని పని చేసి ఇప్పుడిప్పుడే ఓ దారికి వస్తున్నామని ఆయన అన్నారు. వ్యవసాయని ప్రాధాన్యత పెరిగిందని, హైదరాబాద్‌కి వెళ్లిన వాళ్ళు గ్రామాలకు మళ్ళీ వస్తున్నారని, వ్యవసాయం ప్రాధాన్య పెరిగింది భూముల ధరలు పెరిగాయని ఆయన అన్నారు. రెండేళ్ల నుండి నరేంద్రమోదీ పంచాయితీ మొదలు పెట్టిండని, 2 ఏళ్ల…
జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ భవన సముదాయాన్ని ప్రారంభించారు. అనంతరం జనగామలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామని ఆయన అన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ…