వరంగల్ ఎంజీఎం పరిసరాలను,ఆర్ఐసీయూ ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,డీఎంఈ రమేష్ రెడ్డి. శ్రీనివాస్ కు చాలా సమస్యలు ఉన్నాయి. పరిస్థితి కూడా సీరియస్ గా ఉంది. హాస్పిటల్ ఘటనకు బాధ్యులపై రిపోర్ట్ మేరకు మంత్రి హరీష్ రావు యాక్షన్ తీసుకున్నారు. మంత్రి హరీష్ రావు పొద్దున్నే మాట్లాడారు విజిట్ చేయమని చెప్పారన్నారు మంత్రి ఎర్రబెల్లి.
ఎలుకలు కొరుక్కుతినడం మా నిర్లక్షమే..మేము కాదనడం లేదన్నారు. ఎంజీఎంలో డ్రైనేజీ ఇబ్బంది ఉంది. అండర్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకుంటాం. ఏజీల్ ఎజెన్సీ సంస్థ నిర్లక్ష్యం ఉంది. ఏజిల్ ఎజెన్సీ నీ బ్లాక్ లిస్ట్ లో పెడ్తాం. కొత్త హాస్పిటల్ వస్తోంది…దాన్ని ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పూర్తిగా ఎంక్వైరీ చేసి బాధ్యులపై యాక్షన్ తీసుకుంటాం అన్నారు. కుటుంబసభ్యుల అంగీకారం మేరకు పేషంట్ శ్రీనివాస్ ని హైదరాబాద్ తరలించాం. కరోనా సమయంలో ఎంజీఎంలో గొప్ప సేవలు అందించారు….డాక్టర్ లు బాగా కష్టపడ్డారన్నారు ఎర్రబెల్లి.
మరోవైపు వరంగల్ ఎంజీఎం లో పేషంట్ ను ఎలుకలు గాయపరిచిన ఘటనలో వైద్యులను సస్పెండ్ చేయడం పై ఎంజీఎం వైద్యులు నల్ల బ్యాడ్స్ పెట్టుకొని నిరసన తెలిపారు. బదిలీ చేసిన సూపరింటెండెంట్ తో పాటు ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేయడాన్ని ఎత్తివేయాలని మంత్రికి వినతి పత్రం ఇచ్చారు. రేపటి లోపు ప్రభుత్వం నుండి సానుకూల స్పందన రాకపోతే.. సమ్మెకు వెళతాం అంటున్నారు వైద్యులు.