T20 World Cup: ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 ప్రారంభమైన తొలిరోజే సంచలనం నమోదయ్యేది. అయితే ఆఫ్ఘనిస్తాన్ 112 పరుగులు మాత్రమే చేయడం ఇంగ్లండ్‌కు కలిసొచ్చిందని చెప్పాలి. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆప్ఘనిస్తాన్ తొలుత బ్యాటింగ్ చేసి 19.4 ఓవర్లలో 112 పరుగులకు ఆలౌటైంది. 113 పరుగుల విజయలక్ష్యాన్ని ఇంగ్లండ్ 18.1 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లివింగ్ స్టోన్ 29 పరుగులు…
Jhulan Goswami: టీమిండియా మహిళా జట్టు దిగ్గజ పేసర్ జూలన్ గోస్వామి తన కెరీర్‌లో చిట్టచివరి మ్యాచ్ ఆడేసింది. ఈరోజు ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే ఆమెకు చివరి మ్యాచ్. అయితే ఆఖరి మ్యాచ్‌లో జూలన్ గోస్వామి బ్యాటింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరగడం అభిమానులను నిరాశపరిచింది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు జూలన్ గోస్వామిని భారత జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రత్యేకంగా గౌరవించింది. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్‌కౌర్ కన్నీటిపర్యంతమైంది. అటు…
ICC Test Championship Finals: క్రికెట్‌లో టెస్ట్ క్రికెట్‌లో ఉండే మజానే వేరు. కానీ కొన్నేళ్లుగా టీ20లు రాజ్యమేలుతున్నాయి. దీంతో ఐసీసీ టెస్ట్ క్రికెట్ పునరుజ్జీవం కోసం టెస్టు చాంపియన్ షిప్ నిర్వహిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్ల మధ్య టెస్టు సిరీస్‌లు జరిపి పాయింట్ల ఆధారంగా రెండేళ్లకోసారి ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే గత ఏడాది తొలిసారిగా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడగా న్యూజిలాండ్ విన్నర్‌గా…
బ్రిటన్ దివంగత రాణి ఎలిజబెత్-2 చివరియాత్ర లాంఛనంగా ప్రారంభమైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు.
బ్రిటన్‌ను ఎక్కువ కాలం ఏలిన రాణి ఎలిజబెత్-2 కన్నుమూయడంతో ఆమె కుమారుడు 73 ఏళ్ల చార్లెస్-3కి సింహాసనం బదిలీ అయింది. ఇకపై ఆయనను కింగ్ చార్లెస్ 3 పేరుతో వ్యవహరిస్తారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో యాక్సెషన్ కౌన్సిల్ భేటీలో కింగ్ చార్లెస్-3ను బ్రిటన్ కొత్త చక్రవర్తిగా ప్రకటించారు.
Common Wealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్ మహిళల క్రికెట్ టీ20 లీగ్‌లో భారత్ ఫైనల్ కు చేరింది. శనివారం ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో భారత్ 4 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్లో ఓడిపోయినా భారత్‌కు రజతం వస్తుంది. సెమీఫైనల్లో టాస్ గెలిచిన భారత మహిళలు బ్యాటింగ్ ఎంచుకున్నారు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఓపెనర్…
Ben Stokes Retirement to ODI Cricket: ఇంగ్లండ్ జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ షాకిచ్చాడు. అనూహ్యంగా వన్డేల నుంచి తాను తప్పుకుంటున్నట్లు బెన్ స్టోక్స్ ప్రకటించాడు. మంగళవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరగనున్న తొలి వన్డే తనకు చివరిదని సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ స్టోక్స్ సొంత మైదానం డర్హామ్‌లో జరగనుంది. అయితే ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు బెన్ స్టోక్స్ వెల్లడించాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి…
ఎప్పుడూ కూల్ గా ఉండే యూకే ప్రస్తుతం మండిపోతోంది. ఇంగ్లాండ్ వ్యాప్తంగా భారీగా ఉష్టోగ్రతలు నమోదు అవుతున్నాయి. కనీవిని ఎరగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో బ్రిటన్ వాతావరణ శాఖ జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే సోమవారం, మంగళవారాల్లో ఇంగ్లండ్ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అంచానా వేసింది. గతంలో ఉన్న రికార్డులను తిరిగిరాసే అవకాశం ఉందని అక్కడి అధికారులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో…
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ విరాట్ కోహ్లీ నిరాశపరిచడంతో.. అతని ప్రదర్శనపై అప్పుడే చర్చలు, విమర్శలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ అనంతరం ఓ జర్నలిస్ట్ మరోసారి కోహ్లీ ఆటతీరుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించాడు. ‘కోహ్లీ ప్రదర్శనపై చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి’ అని అనగానే రోహిత్ ఒక్కసారిగా కోపాద్రిక్తుడయ్యాడు. ‘ఎందుకు చర్చలు జరుగుతున్నాయ్ అయ్యా, నాకర్థం కావడం లేదు’ అంటూ బదులిచ్చాడు. ఆ తర్వాత శాంతించి.. కోహ్లీకి మద్దతుగా మాట్లాడాడు. ‘‘ఏ ఆటగాడు ఎప్పుడూ…