2014లో ఏపీ పీజీ ఎంఈటీ పరీక్షా పత్రం లీకేజీలో కేసులో అమీర్ అహ్మద్ కు చెందిన రూ.76 లక్షల ఆస్తులను ఈడీ తాత్కలికంగా జప్తు చేసింది. ఏపీ సీఐడీ పోలీసుల ఆధారంగా ఈ కేసును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ చేపట్టారు. ఏపీ పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ఆస్తులు అటాచ్ చేసింది. కర్ణాటకలోని అమీర్ అహ్మద్ ఆస్తులను జప్తు చేయడంతో పాటు ఆయనను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. అప్పట్లో ఈ కేసు…
చైనా యాప్‌ల కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఢిల్లీకి చెందిన చార్టెడ్ అకౌంటెంట్ రవికుమార్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అతడిని విచారణ చేస్తుంది. ఫోర్జరీ బిల్లులతో రూ.1,100 కోట్లు చైనాకు తరలించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బోగస్ బిల్లుల జారీలో సీఏ రవికుమార్ పాత్ర కీలకంగా ఉన్నట్టు ఈడీ అధికారులు గుర్తించారు. నకీలీ చైనా యాప్‌లను ఇండియాలో ప్రవేశపెట్టేందుకు అతడు యత్నించినట్టు నాంపల్లి కోర్టుకు ఈడీ అధికారులు తెలిపారు. బోగస్ బిల్లుల జారీలో రవికుమార్…
అమెజాన్ ఇండియా సీఈవో అమిత్ అగర్వాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. ఫ్యూచర్ గ్రూప్, అమెజాన్ మధ్య ఒప్పందంలో భాగంగా విదేశీ పెట్టుబడులను ఉల్లంఘించారని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి అమెజాన్ సీఈవో అమిత్ అగర్వాల్ వచ్చే వారంలో విచారణకు హాజరు కావాలని ఈడీ స్పష్టం చేసింది. Read Also: ‘బిగ్‌బాస్’ నుంచి రవి ఎలిమినేట్.. అసలు ఏం జరిగింది? 2019లో అమెజాన్ కంపెనీ రూ.1400 కోట్ల ఒప్పందంతో ఫ్యూచర్ రిటైల్ గ్రూప్‌లో…
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ కుంభకోణంలో ఈడీ దూకుడు పెంచింది. తాజాగా రూ.144 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు. ఇందులో 131 ఆస్తులు ఉన్నాయని వారు వెల్లడించారు. హైదరాబాద్, బెంగళూరు, నోయిడా, చెన్నైలలో 97 ప్లాట్లు, ఆరు విల్లాలు, 18 కమర్షియల్ షాపులను మనీ లాండరింగ్ కింద అటాచ్ చేసినట్లు వారు వివరించారు. వీటిలో ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి, శ్రీహరిబాబు, రాజేశ్వర్‌రెడ్డి, కె.పద్మ, నాగలక్ష్మీ ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. ఆస్తులే కాకుండా…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ నేపథ్యంలో ఈడీ కార్యాలయంలో హాజరైన నటుడు తరుణ్ విచారణ ముగిసింది. 8 గంటల పాటు తరుణ్ ను అధికారులు విచారించారు. కాగా, ఈరోజుతో ముగిసిన సినీతారల విచారణ ముగిసింది. తమ బ్యాంక్ ఖాతాల వివరాలు, స్టేట్ మెంట్ లతో 12 మంది సినీ సెలబ్రిటీలు విచారణకు హాజరైయ్యారు. పూరి జగన్నాథ్ తో ప్రారంభం అయ్యిన ఈడీ విచారణ, తరుణ్ తో సినీ తారల విచారణ ముగిసింది. ఆగస్ట్ 31న పూరి జగన్నాథ్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసుకు సంబంధించి పలువురు టాలీవుడ్ సినీప్రముఖుల్ని ఈడీ ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే పూరీ, ఛార్మి, రకుల్‌ప్రీత్, రవితేజ, రానా, నవదీప్ వంటి స్టార్స్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. ఇక సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17న తనీష్, సెప్టెంబర్ 22న తరుణ్ విచారణలతో దర్యాపు ముగియనున్నది. అయితే ఈ దర్యాప్తు తరువాత ఈడీ అధికారులు ఏం చేయబోతారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా రేపు నటి ముమైత్…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్ నుండి రవితేజ, ఛార్మి, రానా, రకుల్ ప్రీత్ సింగ్, నందు ఇలా వరసగా విచారణ సాగిస్తున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు, విదేశాల నుంచి డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై ఈ విచారణ సాగుతున్నట్లు తెలుస్తుంది. రేపు నటుడు నవదీప్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ముందు హాజరుకానున్నారు. కాగా, ఇదే రోజు విచారణకు హాజరుకావాల్సిందిగా ఎఫ్-క్లబ్ జనరల్ మేనేజర్‌కు…
టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, రకుల్ ప్రీత్ విచారణకు హాజరయ్యారు. అయితే తాజాగా ఈరోజు నందు ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైయ్యారు. నందు ఈనెల 20న విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. ఈడీ అధికారుల అనుమతితో నేడు విచారణకు హాజరయ్యాడు. కెల్విన్, జీశాన్‌లతో నందుకు పరిచయం ఉందని, అందులో భాగంగానే డ్రగ్స్ వ్యవహారంపై ఈడీ ప్రశ్నిస్తుంది. ఎక్సైజ్ పోలీసులు ముందు నందు విచారణ జరుగుతోంది. కెల్విన్ ఇచ్చిన…
డ్రగ్ అనేది ఒక్క సెలెబ్రెటీ ఇస్యు మాత్రమే కాదని, పొలిటికల్- బార్డర్- ఆర్థికపరమైన ఇష్యూ కూడా అని నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘టాలీవుడ్ డ్రగ్ కేసు ఇష్యూపై త్వరలో మాట్లాడుతాను.. నా వ్యక్తిగత అనుభవం తెలియజేస్తాను’ అంటూ పూనమ్ కౌర్ తెలిపారు. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలకు కొందరి అభిమానులు మద్దతు తెలియపరుస్తున్నారు. వ్యవస్థలోని లోపం పూనమ్ ఎత్తిచూపిందంటున్నారు. సినీ సెలెబ్రెటీలను నాలుగు రోజులు విచారణ జరిగి ఆతరువాత ‘యథా రాజా.. తథా…
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నటి ఛార్మి విచారణ ముగిసింది. ఉదయం 10.30 నుండి సాయంత్రం 6.30 వరకు ఛార్మి ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఈడీ అధికారులు కోరిన బ్యాంక్ డ్యాక్యుమెంట్స్ సమర్పించాను.. దర్యాప్తుకు పూర్తిగా సహకరించాను. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తిరిగి ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు సహకరిస్తాను’ అంటూ ఛార్మి తెలిపింది. కాగా విచారణ సందర్భంగా ఆమెకు సంబంధించిన రెండు బ్యాంక్ ఖాతాల లావాదేవీలను ఈడీ అధికారులు పరిశీలించారు. 2016లో కెల్విన్‌తో మాట్లాడిన…