శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. పాత్ర ఛాల్ భూ కుంభకోణంలో రౌత్ పాత్రపై గతంలో ఆరోపణలు వినిపించాయి. రూ. 1034 కోట్ల ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్‌ఎస్‌ఐ)పై విచారణకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరియు అతని కుటుంబ సభ్యులకు చెందిన అలీబాగ్‌లోని ఎనిమిది ల్యాండ్ పార్సెల్‌లను అటాచ్ చేసింది. అంతేకాకుండా ముంబైలోని దాదర్‌లోని ఒక ఫ్లాట్‌ను తాత్కాలికంగా అటాచ్ చేసింది. పాత్ర ఛాల్ భూ…
సంచలనం కలిగించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలకాంశాలు బయటకు వస్తున్నాయి. ఈడీ దాఖలుచేసిన కోర్టీ ధిక్కరణ పిటిషన్ విచారణకు రానుంది. కెల్విన్ కూల్ ప్యాడ్ లో సినీతారల చిట్టా ఉందని ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. సమగ్ర దర్యాప్తు వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను పాటించడంలేదని ఈడీ కోర్టుకి తెలిపింది. సినీతారల కాల్ రికార్డ్స్ ఎక్సైజ్ శాఖ కోర్టుకు సమర్పించలేదని ఈడీ పేర్కొంది. ఇప్పటి వరకు ఆరు లేఖలు వ్రాసినా వివరాలు ఇచ్చేందుకు ఎక్సైజ్ శాఖ ససేమిరా…
మహారాష్ట్ర ప్రభుత్వంలోని నేతలను కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందా? అంటే అవుననే సమాధానం చెబుతున్నాయి.. వరుసగా జరుగుతోన్న ఘటనలు.. మొన్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్… నిన్న మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ జైలుకు పంపింది. తాజాగా ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే బంధువు కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించిన ఈడీ.. ఠాణెలోని నీలాంబరి ప్రాజెక్టులో భాగమైన 11 రెసిడెన్షియల్ ఫ్లాట్లను అటాచ్ చేసింది.…
భారత్‌లోని బ్యాంకుల నుంచి రూ.వేల కోట్లలో అప్పులు తీసుకుని ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ కేసులో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వారి నుంచి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రూ.18 వేల కోట్లు వసూలు చేసిందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమాచారం ఇచ్చింది. 2002లో నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 4,700 కేసులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించినట్టు తెలిపింది. అన్ని కేసుల్లో…
కృష్ణా జిల్లా గుడివాడలో కేసినో వ్యవహారంపై ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది.. ఈ వ్యవహారం వైసీపీ, టీడీపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనిపిస్తోంది… ఘాటు విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతూనే ఉండగా.. మరోవైపు ఫిర్యాదులు కూడా వెళ్తున్నాయి.. ఇప్పటికే ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేసింది టీడీపీ.. ఇక, డీజీపీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు టీడీపీ నేతలు.. మరోవైపు.. ఈ వ్యవహారంపై గవర్నర్‌కు లేఖ రాశారు టీడీపీ అధినేత…
ముంబై: టాలీవుడ్‌లో పలు సినిమాల్లో హీరోగా నటించిన సచిన్ జోషికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు షాకిచ్చారు. ఈ మేరకు మనీ లాండరింగ్ కేసులో సచిన్ జోషికి చెందిన మొత్తం రూ.410 కోట్ల ఆస్తులను జప్తు చేస్తూ ఈడీ చర్యలు తీసుకుంది. వీటిలో ఓంకార్ గ్రూప్ ఆస్తులు రూ.330 కోట్ల విలువైన ఫ్లాట్లు ఉన్నాయి. మిగిలిన రూ.80 కోట్ల ఆస్తులు సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ కంపెనీలకు చెందినవని ఈడీ తెలిపింది. Read Also: వివాదంలో విరాట్…
హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్ రావు వ్యవహారంపై దృష్టి సారించింది ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. స్థిరాస్తి వ్యాపారం పేరిట మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై గచ్చిబౌలి 7, నార్సింగి, రాయదుర్గం పీఎస్ లో కేసులు నమోదయిన సంగతి తెలిసిందే. మొత్తం సైబరాబాద్ లో 13 కేసులు, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో మూడు కేసులు సంధ్యా కన్వెన్షన్ ఎండీ శ్రీధర్…
నిధుల మళ్లింపు వ్యవహారంలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు (టీఆర్ఎస్) చెందిన మధుకాన్ సంస్థల కార్యాలయాలు, ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు. రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి సంబంధించి బ్యాంకులను రూ.1064 కోట్ల మేర మోసం చేశారన్న ఆరోపణలపై ఇదివరకే సీబీఐ కేసు నమోదు చేయగా ఇప్పుడు ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. నామా నాగేశ్వరరావు నేతృత్వంలోని మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ రాంచీ-జంషెడ్పూర్ల మధ్య 163 కిలోమీటర్ల పొడవైన నాలుగు…
తెలుగు రాష్ట్రాల్లో రుణ యాప్‌లు ఎంతటి దారుణాలకు ఒడిగట్టాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈడీ తన వేగం పెంచింది. రుణ యాప్ ల కేసులో మరో రూ.51కోట్ల ఆస్తులు అటాచ్ చేశాయి. ఫైనాన్స్ కంపెనీ పీసీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కి చెందిన రూ.51 కోట్ల అటాచ్ అయ్యాయి. గతంలో పీసీ ఫైనాన్షియల్ కు చెందిన రూ.238 కోట్లు ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. క్యాష్ బీన్ మొబైల్ యాప్ ద్వారా రుణాలు ఇచ్చింది పీసీఎఫ్ఎస్. చైనాకు…