ఘన్ శ్యాందాస్ జెమ్స్ అండ్ జ్యువెల్స్ ఎండీ సంజయ్ అగర్వాల్ పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. తప్పుడు పత్రాలతో సంజయ్ అగర్వాల్ బ్యాంకులను రూ.90కోట్ల మోసం చేసినట్లు ఈడీ వెల్లడించింది. సీబీఐ కేసుల ఆధారంగా మనీలాండరింగ్ విచారణను ఈడీ చేపట్టింది. బ్యాంకుల నుంచి మోసపూరితంగా పొందిన సొమ్ముతో నగల దుకాణాలు తెరిచారని ఈడీ పేర్కొంది. అంతేకాకుండా కుటంబ సభ్యుల పేరిట సంజయ్ అగర్వాల్ నాలుగు నగల దుకాణాలు తెరిచారని, సంజయ్ కుమార్ తప్పుడు పేరుతో విదేశాలకు వెళ్లి బ్యాంకు ఖాతాలు తెరిచారని ఈడీ తెలిపింది.
ఉద్యోగి పేరిట బినామీ ఆస్తులు కూడబెట్టుకున్నారని, సంజయ్ అగర్వాల్ కు సంబంధించిన రూ.9.5 కోట్ల ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ వెల్లడిచింది. శంషాబాద్, తెల్లాపూర్, రాయదుర్గం, కొంపల్లి, జూబ్లీహిల్స్ లో భూములు అటాచ్ చేసినట్లు తెలిపింది. అయితే ఫిబ్రవరి 11న సంజయ్ అగర్వాల్ ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది.