Minister Payyavula Keshav: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 3,389 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్.. ఏపీ అసెంబ్లీలో అంతర్రాష్ట్ర ఉద్యోగుల వ్యవహారంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ నుంచి 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి 1,447 మంది ఉద్యోగులు అంతర్రాష్ట్ర బదిలీలకి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగులు 122 మంది బదిలీపై నిర్ణయించాం.. GORT 1412GA ద్వారా అన్ని ఏర్పాట్లు చేశామని.. 122 మందిలో 61 మంది ఇప్పటికే బదిలీ అయ్యారు అని పేర్కొన్నారు..
Read Also: Gold Rate Today: బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయ్.. లేటెస్ట్ రేట్స్ ఇవే!
రాష్ట్ర ద్వైపాక్షిక పునర్వ్యవస్థీకరణ సమస్యల కోసం మంత్రులు కమిటీ, సీనియర్ అధికారుల కమిటీ ఏర్పాటు చేశామని సభలో వివరించారు మంత్రి పయ్యావుల కేశవ్.. మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క.. మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మంత్రి పొన్నం ప్రభాకర్ ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి అనగాని సత్యప్రసాద్, మంత్రి కందుల దుర్గేష్, మంత్రి బీసీ జనార్ధనరెడ్డి ఉన్నారని.. ఇక, సీనియర్ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో ఇంకొక కమిటీ ఏర్పాటు చేసినట్టు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించారు మంత్రి పయ్యావుల కేశవ్..