ఆంధ్రప్రదేశ్‌లో గత కొంతకాలంగా కొనసాగుతోన్న పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కి చేరినట్టుగా తెలుస్తోంది.. ఆందోళనకు దిగిన ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వ విజ్ఞప్తితో మళ్లీ విధుల్లోకి హాజరయ్యారు.. కానీ, ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీపై ప్రకటన మాత్రం రాలేదు.. చర్చలు కొనసాగుతూనే ఉన్నా.. ప్రకటన రాకపోవడంతో.. మళ్లీ ఉద్యమానికి సిద్ధం అయ్యారు ఉద్యోగులు.. అయితే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. పీఆర్సీ ఎపిసోడ్ క్లైమాక్స్‌కు చేరినట్టు తెలుస్తోంది.. ఉద్యోగులకు సంక్రాంతి కానుగా పీఆర్సీపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటన చేస్తారని తెలుస్తోంది.…
టిఫినీలు తిన్నారు.. కాఫీలు తాగారు. కీలక సమావేశంలో ల్యాప్‌టాపుల్లో మునిగిపోయారు. ఒకరు 14 అంటే.. ఇంకొకరు 34కి తగ్గేది లేదన్నారు. ఆ మీటింగ్స్‌లో ఇదే జరుగుతోందా? కాలక్షేపం కబుర్లు.. వ్యూహాత్మక ఎత్తుగడలతో సమావేశాలను మమ అనిపించేస్తున్నారా? పీఆర్సీపై ఎడతెగని చర్చలు..! ఏపీలో లక్షలాది మంది ఉద్యోగులకు కీలకమైన పీఆర్సీ కసరత్తు కొలిక్కి రాలేదు. ఫిట్‌మెంట్‌పై తేలుస్తారా తేల్చరా అని ఉద్యోగ సంఘాలు గట్టిగా అడగడంతో… ఆ మధ్య జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహించారు అధికారులు. 13…
పీఆర్సీ, పెండింగ్ సమస్య పరిష్కారం ఆంధ్రప్రదేశ్‌లో ఆందోళన బాటపట్టాయి.. 70కి పైగా డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టాయి.. వెంటనే పరిష్కారం చూపాలంటూ ఉద్యమాన్ని చేపట్టాయి.. అయితే, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపుతూ వచ్చిన ప్రభుత్వం.. తాత్కాలికంగా ఉద్యోగుల ఆందోళనకు బ్రేక్‌లు వేసింది.. పెండింగ్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించాయి.. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, సీఎస్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ…
ఆంధ్రప్రదేశ్‌లో పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల మధ్య కాస్త గ్యాప్ పెరుగుతోంది.. జాప్యంపై మండిపడుతున్న ఉద్యోగ సంఘాలు పీఆర్సీపై ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టాయి.. ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలని ఉద్యోగ సంఘాల డిమాండ్ చేస్తున్నారు.. ప్రభుత్వానికి ఈ నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు ఏపీజేఏసీ చైర్మన్ బండి శ్రీనివాసరావు.. ఈ నెల 27 లోపు అన్ని సంఘాల సమావేశాలు నిర్వహిస్తాం.. ఆ తరువాత సీఎస్ ను కలిసి మా భవిష్యత్…