ఉద్యోగుల జీతాలకు ఏపీ పెడుతున్న ఖర్చెంతో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలకు భారీగా ఖర్చుపెడుతుంది. దేశంలో ఆరు ప్రధాన రాష్ట్రాల కు సమానంగా ఉద్యోగుల జీతాలకు ఖర్చు చేస్తోంది. 2020-21లో ఉద్యోగుల కోసం ఏపీ 37,458 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది 33,102 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది. ప్రభుత్వ ఆదాయంలో 36 శాతం ఉద్యోగుల కోసమే ఖర్చుపెడుతోందని ఓ నివేదికలో తేలింది.ప్రభుత్వ మొత్తం ఖర్చులో జీతాలు, పెన్షన్ల వాటా ఏపీలోనే అత్యధికమని చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ ఇచ్చిన నివేదిక తెలిపింది.
మిగతా రాష్ట్రాల కంటే ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా ఎక్కువగా ఉంది. మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రం వాటా 21శాతం ఉండగా, ఏపీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వాటా 36శాతం ఉంది.పీఆర్సీని అమలు చేస్తే 10వేల కోట్లకు పైగా భారం పడనుంది. ఇప్పటికే జీతాలు, పెన్షన్ల రూపంలో 68,340 కోట్లు ఉద్యోగులకు ఖర్చు పెడుతున్నారు. ఇదంతా బడ్జట్ లెక్క ప్రకారం నిరర్థక ఖర్చు కింద చూపిస్తారు. ఏ మాత్రం తిరిగిరాని ఖర్చుల కింద 68 వేల కోట్లను ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
Also Read
- Local Body Elections: ‘జయహో బీసీ’ నినాదంతో స్థానిక సమరానికి టీడీపీ.. సీఎం కీలక ప్రకటన..
- Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
- Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
పీఆర్సీ విషయంలో ఉద్యోగ నేతల డిమాండ్ కి ప్రభుత్వం తలవొగ్గింది. లేదంటే సమ్మెకు దిగుతామని ప్రకటించారు. కొత్తగా పీఆర్సీ అమలు చేస్తే మరో 10వేల కోట్ల ఖర్చు కలుస్తుందని భావిస్తున్నారు. అన్నీ కలుపుకుంటే 78వేల కోట్లు ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కింద ఏపీ ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. అంటే, రాబోయే రోజుల్లో ఉద్యోగుల జీతాలకు కూడా ప్రభుత్వం అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.దేశంలో హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, ఉత్తరాఖండ్, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో ఖర్చు ఎక్కువగా వుందని ఓ సర్వేలో తేలింది.
11వ ఆర్థిక సంఘం నివేదిక ప్రకారం 2018-19లో జీతాలు, పెన్షన్ల కోసం రూ.52,513 కోట్లు ఖర్చు చేశారని సీఎం జగన్ కు ఇచ్చిన నివేదికలో పొందుపరిచారు. తాజాగా 2020-21 నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.67,340 కోట్లకు చేరిందని వివరించారు. ఎస్ ఓ ఆర్ లో నమోదు చేసిన వివరాల ప్రకారం 2018-19లో జీతాలు 84 శాతం ఉంది. గత ఆర్థిక ఏడాది 2020-21లో జీతాలు, పెన్షన్లు ఎస్ఓఆర్ లో 111 శాతానికి చేరింది.
తాజావార్తలు
-
Jailer 2 Pre Release Event: హైదరాబాద్లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..