Andhra Pradesh: ఏపీ సీఎం జగన్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలకు పచ్చజెండా ఊపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య బదిలీల కోసం పలువురు ఉద్యోగులు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అంతరాష్ట్ర బదిలీల కోసం తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ నుంచి ఏపీకు 1338 మంది ఉద్యోగులు, ఏపీ నుంచి తెలంగాణకు 1804 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. జీఏడీ రాష్ట్ర పునర్విభజన…
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల సాధారణ బదిలీల గడువును ఈ నెలాఖరు వరకు పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. తొలుత ఈనెల 17 వరకే బదిలీలు ఉంటాయని ప్రకటించగా.. కొన్నిశాఖల్లో బదిలీలు పూర్తి కాలేదని ప్రభుత్వానికి సమాచారం వెళ్లింది. దీంతో ఉద్యోగ సంఘాలు, కలెక్టర్ల నుంచి వచ్చిన అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం ఈనెల 30 వరకు ఉద్యోగుల సాధారణ బదిలీల గడువు పెంచుతూ సీఎంవో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి గురువారం రాత్రి…