ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. కాకినాడ జిల్లా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో రోడ్డుపై నిలిపి ఉన్న బ్యాటరీ బైక్ షార్ట్ సర్క్యూట్ కారణంగా.. మొదట పొగలు వచ్చి.. ఆ తర్వాత మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధం అయ్యింది.
తెలంగాణలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాల పేలుడు వాహనదారుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓవైపు ఇంధన ధరల పెరుగుదల.. మరోవైపు పర్యావరణ హితం కోసం ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేస్తే ఇలాంటి ఘటనలు వాటిని కొనుగోలు చేయాలనుకున్న మిగతా వారిలో భయాన్ని పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాక మండంల పెద్ద చీకోడు గ్రామంలో ఛార్జింగ్ పెట్టిన ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక…
ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఇక వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా మామడ మండలం పరిమండలంలో నివాసముంటున్న మహేందర్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేశాడు. కొద్ది రోజులు బాగానే…
పెట్రోల్ ధరలు పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రికల్ బైకుల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇటీవల వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు కాలిపోతూ ప్రజలకు చికాకు తెప్పిస్తున్నాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడులో ఓ వ్యక్తి ఆగ్రహంతో ఎలక్ట్రిక్ బైకుపై పెట్రోల్ పోసి కాల్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తిరుపత్తూర్ జిల్లా అంబూరుకు చెందిన ఓ వాహనదారుడు చాలా కాలం కిందట ఓలా కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ బైక్ కొనుగోలు…
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కి ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయి. దీంతో ఆయా వాహనాల జోలికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా…
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్నది. చమురు ధరలు చుక్కలను తాకడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇక సామాన్యుల వాహనంగా పేరుగాంచిన సైకిల్ ను దేశంలోని సుమారు 58 శాతం మంది ప్రజలు వినియోగిస్తున్నారు. ఈ రాకెట్ యుగంలోనూ సైకిళ్ల వినియోగం తగ్గిపోలేదు. సైకిళ్లలో కూడా వివిధ మోడళ్లు అందుబాటులోకి వచ్చాయి. సైకిళ్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తున్నారు. తాజాగా పంజాబ్ కు చెందిన గురుసౌరభ్ సింగ్ అనే వ్యక్తి దృవ్ విద్యుత్ ఎలక్ట్రిక్ కన్వెర్షన్…
దేశంలో పెట్రల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మైలేజీ వస్తుంది. అయితే, ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. బైక్‌కు లిథియం…
తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఎలక్ట్రిక్ బైకుపై నడుపుతున్న ఫొటో సోషల్ మీడియాలో నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ‘ఈవీ ట్రేడ్ ఎక్స్‌పో’ పేరిట జరిగిన విద్యుత్ వాహనాల ప్రదర్శన కార్యక్రమానికి మంత్రి జగదీష్‌రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమం తర్వాత ఆయన ఎలక్ట్రిక్ బైకును నడుపుతూ ట్రయల్స్ వేశారు. వాయు, శబ్ద కాలుష్యాన్ని ఈ-బైక్స్ ద్వారా తగ్గించవచ్చని స్పష్టం చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనేవారికి ట్యాక్స్ మినహాయింపులతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్…
పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ బైక్‌లపై దృష్టిసారించారు వినియోగదారులు. ఎలక్ట్రిక్ బైకులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నా, వాటిపై వస్తున్న పలు రకాల విమర్శల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు. ముఖ్యంగా మైలేజ్, బైక్ రూపం విషయంలోనే ఎక్కువ మంది వెనక్కి తగ్గుతున్న సంగతి తెలిసిందే. దీనిని దృష్టిలో పెట్టుకొని గ్రావ్‌టన్ మోటార్స్ సంస్థ క్వాంటా అనే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఈ బైక్ బ్యాటరీని ఒకసారి రీచార్జ్ చేస్తే 120…