దేశంలో పెట్రల్ డీజిల్ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్రోల్ డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు దృష్టిసారిస్తున్నారు. దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేస్తున్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి మైలేజీ వస్తుంది. అయితే, ఏపీకి చెందిన ఎస్ఆర్ఎం విద్యాసంస్థకు చెందిన విద్యార్థులు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం చేసే ఎలక్ట్రిక్ బైక్‌ను రూపొందించారు. బైక్‌కు లిథియం అయాన్ బ్యాటరీని అమర్చి, వెనుక చక్రానికి మోటార్‌ను అమర్చారు. తక్కవ ఖర్చుతో ఎక్కువ మైలేజీ ఇచ్చేలా ఈ బైక్‌ను రూపొందించారు.
Read: IPL 2022 : రేపు బెంగుళూరు వేదికగా ఐపీఎల్ మెగా వేలం
ఈ బైక్ గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. పూర్తిగా చార్జింగ్ కావడానికి రెండున్నర గంటల సమయం పడుతుంది. ఒకసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 45 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. 45 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయడానికి కేవలం రూ. 15 ఖర్చు అవుతుందని బైక్‌ను రూపొందించిన విద్యార్థులు చెబుతున్నారు. ఈ బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణం చేస్తే 35 కిలోమీటర్ల మైలేజీ వస్తుంది. ఇక ఇందులో రివర్స్ సదుపాయంతో ఎలక్ట్రిక్ బ్రేక్‌ను అమర్చారు.