SBI: ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఆర్‌టీఐ కింద వెల్లడించలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల వేళ ఎలక్టోరల్ బాండ్ల వివరాల పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎలక్టోరల్ బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసింది. అనంతరం ఎన్నికల కమిషన్.. తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. తాజాగా సమాచార హక్కు చట్టం కింద ఎలక్టోరల్ బాండ్ల వివరాలను వెల్లడించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: Harish Rao: ఈసారి కూడా మెదక్ గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది: హరీష్ రావు
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఎలక్టోరల్ బాండ్ల వివరాలు వ్యక్తిగతమని.. వాటిని ఆర్‌టీఐ కింద ఇవ్వలేమని ఎస్‌బీఐ పేర్కొంది. ఈసీకి అందజేసిన తరహాలో ఎన్నికల బాండ్ల వివరాలను డిజిటల్ రూపంలో అందించాలంటూ కమొడోర్ లోకేశ్ బాత్రా గత నెల 13న ఎస్‌బీఐకి సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు అందజేశారు. అయితే ఆ వివరాలు ఇచ్చేందుకు బ్యాంకు నిరాకరించింది. దరఖాస్తుదారుడు కోరిన సమాచారం.. ఆర్‌టీఐలో మినహాయింపులు ఉన్న సెక్షన్ 8(1)(ఇ), సెక్షన్ 8(1)(జె) పరిధిలోకి వస్తుందని ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్, ఆ సంస్థ కేంద్ర ప్రజా సమాచార అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Ghaziabad: బాలికపై తల్లి స్నేహితుడు అత్యాచారం, చిత్రహింసలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఇచ్చేందుకు ఎస్‌బీఐ నిరాకరించడం విచిత్రంగా ఉందని లోకేశ్ బాత్రా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్నికల బాండ్ల వివరాలను బయటపెట్టకుండా ఉండేలా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వేకు ఎస్‌బీఐ తరఫున ఎంత రుసుము చెల్లించారో తెలియజేయాలని కూడా బాత్రా కోరారు. ఆ వివరాలనూ బ్యాంకు వెల్లడించలేదు. ఎస్‌బీఐ నిర్ణయంపై బాత్రా తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఇది కూడా చదవండి: Janata Bar Movie: హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్ లక్ష్మీ.. హీరో ఎవరంటే?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?