ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ దాఖలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా వెల్లడించిన అభ్యర్థుల లిస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
Also Read: Kubera: ధనుష్ ‘కుబేర’లో నాగార్జున పాత్ర ఇదే.. క్లారిటీ వచ్చేసిందిగా..
ఈ లిస్టులో భాగంగా ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్ఠానం మొత్తం 14 మంది పేర్లతో కూడిన అసెంబ్లీ స్థానాలకు అలాగే 3 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాలో విడుదల చేసింది. ఈ లిస్టులో మొత్తం మూడు లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎంపీ అభ్యర్థులను, 11 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ సీనియర్ నేత కేసి వేణుగోపాల్ ప్రకటించారు. ఇక ఈ లిస్టులో ఎవరెవరు ఏ స్థానం నుంచి పోటీలో నిలబడుతున్నారో ఓసారి చూస్తే..
Also Read: SRH vs RCB: కోహ్లీ నామస్మరణతో మార్మోగిన ఉప్పల్ స్టేడియం.. రేపే మ్యాచ్..
3 ఎంపీ స్థానాలకు సంబంధించి.. నర్సాపురం నుండి కొర్లపాటి బ్రహ్మానంద రావ్ నాయుడు, రాజంపేట నుండి ఎస్ కే బషీద్, చిత్తూరు (ఎస్సీ) నుండి ఎం. జగపతి పేర్లను ప్రకటించగా.. అసెంబ్లీ అభ్యర్థుల జాబితా చూస్తే.. చీపురుపల్లి నుండి ఆది నారాయణ జమ్ము,
శృంగవరపు కోట నుండి గేదెల తిరుపతి, విజయవాడ ఈస్ట్ నుండి పొనుగుపాటి నాంచారయ్య, తెనాలి నుండి చందూ సాంబశివుడు,
బాపట్ల నుండి గంటా అంజిబాబు, సత్తెనపల్లి నుండి చంద్రపాల్ చుక్కా, కొండపి(ఎస్సీ) నుండి పసుమర్తి సుధాకర్, మార్కాపురం నుండి షాహిద్ జావిద్ అన్వర్, కర్నూల్ నుండి షేక్ జిలానీ భాష, ఎమ్మిగనూరు నుండి మరుమళ్ల ఖాసీం వలీ, మంత్రాలయం నుండి పీ.ఎస్. మురళీ కృష్ణరాజులు ఉన్నారు.