కేబినెట్ భేటీలో అజెండాలోని అంశాలపై చర్చ తర్వాత మంత్రులతో మాట్లాడిన సీఎం వైఎస్ జగన్.. ఎన్నికలకు సిద్ధంకండి అంటూ మంత్రులకు సూచించారు.. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉంటాయని స్పష్టం చేసిన ఆయన.. జగనన్న సురక్షా క్యాంపైన్ ను మంత్రులు పర్యవేక్షించాలని తెలిపారు.
Gorantla Butchaiah Chowdary: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. ఈ సారి టికెట్ వచ్చేది ఎవరికి? సిట్టింగ్‌లకు అవకాశం ఉంటుందా? ఉండదా? అనే చర్చ సాగుతోంది.. అయితే, వచ్చే ఎన్నికలలో టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్ళీ టిక్కెట్లు ఇస్తారని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు , రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబే స్వయంగా చెప్పినట్లు తెలిపారు. రాజమండ్రి రూరల్ టికెట్టు పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారని…
Election Heat in YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో అప్పుడే ఎన్నికల హీట్ మొదలైంది.. టార్గెట్ 2024గా వివిధ క్యాంపైన్ల కోసం కసరత్తు షురూ చేసింది వైసీపీ.. అందులో భాగంగా ఈ నెల 7వ తేదీ నుంచి జగనన్నే మన భవిష్యత్తు క్యాంపైన్‌కు శ్రీకారం చుట్టబోతున్నారు.. క్యాంపైన్ ట్యాగ్ లైన్.. నువ్వే మా నమ్మకం జగన్ అని ఖరారు చేశారు. జగనన్నే మన భవిష్యత్తు అనే ప్రధాన క్యాంపైన్ కింద వచ్చే ఎన్నికల వరకు…
Minister Dharmana Prasada Rao: ఎన్నికల్లో గెలుపు, ఓటములపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.. శ్రీకాకుళం పట్టనానికి చెందిన యువనేతలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి ధర్మాన ప్రసాదరావు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. ధర్మాన ప్రసాద్ ఓడిపోతే కొంప ఏమీ మునిగిపోదు… గెలిస్తే ఎంత..? ఓడిపోతే ఎంత..? అంటూ హాట్ కామెంట్లు చేశారు.. సమాజంలో.. ప్రభుత్వం వలన వస్తున్న మార్పులను యువకులు గుర్తించాలని సూచించిన ఆయన.. సమాజాన్ని నడిపించేందుకు…
టీడీపీలో కొత్త చర్చ జరుగుతోంది. పార్టీలో కుమ్మక్కు రాజకీయం జరుగుతోందా..? అనేదే టీడీపీ సర్కిల్సులో తాజా హాట్ టాపిక్. చాలా కాలంగా టీడీపీ అధినాయకత్వం స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాడండి.. స్థానిక ఎమ్మెల్యేలు చేసే అవినీతి అక్రమాలు తదితర అంశాలపై ఫోకస్ పెట్టండని ఆదేశిస్తోంది. కానీ ఈ మాటను మెజారిటీ ఇన్ఛార్జులెవ్వరూ లక్ష్య పెట్టడం లేదట. ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యాలయానికి రావడం ఓ ఫొటో దిగడం.. వాటిని పార్టీ కార్యాలయానికి పంపుకొంటూ చేతులు దులిపేసుకుంటున్నారట. దీంతో…
GVL Narasimha Rao: అధికారం పోగానే చంద్రబాబు హైదారాబాద్ వెళ్లిపోయారు.. 2024 ఎన్నికల తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పరిస్థితి గంతే.. లోటస్ పాండ్‌లో కూర్చుంటారు అంటూ జోస్యం చెప్పారు భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయసహకారాలు అందిస్తున్నా రాష్ట్రంలో సుపరిపాలన లేదని విమర్శించారు.. వైసీపీ, టీడీపీ సొంత వ్యాపారాల కోసం పరిపాలనను ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. అయితే, బీజేపీ మాత్రమే ఏపీని అభివృద్ధి చేసే…
గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి జనసేన తరఫున బరిలోకి దిగిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ.. ఓటమిపాలయ్యారు.. ఆ తర్వాత కొంతకాలం.. రాజకీయాల్లో యాక్టివ్‌గా కనిపించినా.. ఆ తర్వాత దూరం అయ్యారు.. అయితే, మరోసారి ఎన్నికల్లో పోటీకి సిద్ధం అవుతున్నట్టు ఆయన వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి.. విశాఖ నుంచే మరోసారి పార్లమెంట్‌కు పోటీ చేస్తానని ఆయన మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు.. మన వ్యవస్థలో స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం కూడా ఉందని…