ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో దేశవ్యాప్తంగా SIR ను ప్రకటించారు. ఈ సమావేశంలో, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మాట్లాడుతూ.. 12 రాష్ట్రాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటరు జాబితాల రెండవ దశను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ దశలో ఓటరు జాబితాను అప్ డేట్ చేయడం, కొత్త ఓటర్లను యాడ్ చేయడం, లోపాలను సరిదిద్దడం ఉంటాయని తెలిపారు. SIR నవంబర్ 4న ప్రారంభం కానుంది. తుది ఓటర్ల…
Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.
Delhi Elections 2025: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ఈసీ) ఈరోజు (జనవరి 7) ప్రకటించనుంది. నేటి మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో ఎలక్షన్ కమిషన్ విలేకరుల సమావేశం నిర్వహించి.. ఎన్నికల తేదీల వివరాలను వెల్లడిస్తుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసిందంటూ కాంగ్రెస్ ఆరోపణలు చేసింది. హర్యానా ఫలితాలను అంగీకరించబోమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి కూడా ఫిర్యాదు చేసింది.
దేశ వ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. హర్యానా, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల షెడ్యూలను ఈసీ విడుదల చేసింది. జమ్మూకాశ్మీర్, హర్యానా రాష్ట్రాల్లో 90 చొప్పున అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు.. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక…
కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం, ఒడిశా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు పాల్గొననున్నారని ఈసీ వెల్లడించింది.
Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల తేదీని విడుదల చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఓటేయడానికి మొత్తం 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని వెల్లడించారు. ఇందులో ఇందులో ఇటీవలే 18 ఏళ్లు నిండిన 1.8 కోట్ల మంది ఉన్నారు. వీరంతా తొలిసారి ఓటేసేందుకు అర్హత సాధించారు. భారతదేశంలో 12 రాష్ట్రాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు…
అందరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న లోక్ సభ ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ ఇవాళ (శనివారం) వెలువడనుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు షెడ్యూల్‌ను ప్రకటించనుంది.