కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ తో పాటు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను శనివారం విడుదల చేయనున్నట్లు తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం విజ్ఞాన్ భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేస్తామని తెలిపింది. లోక్ సభతో పాటు ఐదు రాష్ట్రాలు.. ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్ము కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి స్థాయి షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశం ఉంది.
మార్చి 13 తర్వాత ఏ క్షణమైనా ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తులు చేస్తోంది. ఎంపీ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ గత కొన్నిరోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసింది. అందులో భాగంగా రాజకీయ పార్టీలు, అధికారులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఒకే విడతలో కర్ణాటక ఎన్నికలను జరపనున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం బుధవారం ఉదయం 11.30 గంటలకు ప్రకటించనుంది. రాష్ట్రంలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి.
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేస్తోంది. కరోనా, ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో 5 రాష్ట్రాల ఆరోగ్య శాఖలతో ఈసీ సంప్రదింపులు జరిపింది. ఈసీ కరోనా తీవ్రతను అంచనా వేసింది. అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని అన్ని రాజకీయ పార్టీలు కోరడంతో ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది. దీనికి సబంధించిన ప్రత్యక్షప్రసారాన్ని ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా వీక్షించండి.
టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తరువాత, అక్టోబర్ 25 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజున రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. ఎంపిక అనంతరం,…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్…