ఎన్నికల్లో గెలవడానికి ఉచిత పథకాలు ఎక్కువయ్యాయి. ఒక పార్టీకి మించి మరో పార్టీ ఉచిత పథకాల పేరుతో ఊదరగొడుతున్నాయి. ఎవరు ఎక్కువ ఉచిత పథకాలు ఇస్తారో, ఎవరు టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీలు, సైకిళ్ళు, ఇంట్లో గృహోపకరణాలు ఇస్తున్నాయి పార్టీలు. అందుకోసం ఎన్ని లక్షల కోట్లు ఖర్చుపెట్టడానికైనా వెనుకాడడం లేదు. దేశంలో రాజకీయ పార్టీలు ఉచిత పథకాలను అమలు చేయడం గురించి చర్చ సాగుతోంది. ఓట్ల కోసం ఉచిత పథకాలను అమలు చేయాలనుకోవడం దేశానికి ప్రమాదకరమని ప్రధాని మోదీ ఇటీవల హెచ్చరించిన తర్వాత ఈ చర్చ జరుగుతోంది.
పెన్షన్లు, సాయం పేరుతో ఉచితాలను పంచి పెట్టడాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వుంది. దేశంలో అసమానతలను తగ్గించేందుకు ప్రవేశపెట్టే పథకాలను ఉచితాలుగా చూడకూడదని మరికొందరు వాదిస్తున్నారు. మోదీ చేస్తున్న ప్రకటనలు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న వివిధ సంక్షేమ పథకాలకు చట్టబద్ధత లేకుండా చేసేందుకు తెర వెనుక జరుగుతున్న ప్రయత్నాలని ఆరోపించారు. ప్రభుత్వ నిధులను ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెడుతూ ఉచిత పథకాలను ప్రకటించే రాజకీయ పార్టీల పై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ అంశం పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతోంది.