పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైంది.. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశాం. ఇక, పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్
న్నికల పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. పొత్తులపై చర్చలు జరుగుతూనే ఉన్నాయన్న ఆయన.. కొత్త ప్రభుత్వం జనసేన - బీజేపీ నా? లేక జనసేన - టీడీపీ - బీజేపీ ప్రభుత్వమా? ఏదైనా సరే ప్రస్తుత ప్రభుత్వాన్ని మార్చే విధంగా పొత్తులు ఉంటాయని స్పష్టం చేశారు.
TDP: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అప్పుడే పొత్తులు, పోటీలపై చర్చ సాగుతోంది.. అయితే, ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.. టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోని దసరాకు ప్రకటించాలని, పొత్తులపై నిర్ణయం కూడా ఎన్నికల ముందే తీసుకోవాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు.. టీడీపీ అధినేత చంద్రబాబు నరాయుడు అధ్యక్షతన రాజమండ్రిలో జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారు.. ఇక, రాజమండ్రి వేదికగా ఈ రోజు ప్రారంభం…
Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం.. మేం అందరం కలిసి…
Off The Record: పవన్ కళ్యాణ్. కొంత కాలంగా ఒకే పాట పాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని.. కలిసి వచ్చే పార్టీలతో కలిసి వెళ్తానని చెబుతూనే ఉన్నారు. ఇక ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో కలిసిన సందర్భంలో కూడా వారికి టీడీపీతో కలిసి వెళ్తేనే బెటరనే భావనను వ్యక్తం చేస్తూ టీడీపీతో కలిసి కూటమిగా ఎన్నికలకు వెళ్లేలా ఒప్పించే ప్రయత్నం చేశారు పవన్. ఇంత జరుగుతున్నా.. ఇంత చేస్తున్నా.. జనసేన కార్యకర్తలు.. జనసేనలోని…
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. పొత్తులపై, సీఎం పదవిపై ఇప్పటికే తన వైఖరిని స్పష్టంగా తెలిపిన ఆయన.. ఈ రోజు జనసేన కార్యకర్తల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.. ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..
TG Venkatesh: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. పొత్తులు, సీఎం పోస్టులపై ఎప్పటి నుంచో చర్చ సాగుతూనే ఉంది.. తాజాగా మరోసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.. అయితే, ఇప్పుడు మాజీ మంత్రి టీజీ వెంకటేష్ కూడా పొత్తుల వ్యవహారంలో హాట్ కామెంట్లు చేశారు.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై పర్సనల్ అటాక్ చేసి వైసీపీ ఈ పరిస్థితి తెచ్చుకుందన్నారు. ప్రజల…
కనీసం 30-40 స్థానాలుంటేనే సీఎం అభ్యర్థిగా ఉంటామని అనగలం అన్నారు జనసేనాని.. మేం ఒక కులం కోసం పని చేసే పార్టీ కాదన్న ఆయన.. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేపడతామని ప్రకటించారు.. మా బలం మీదే ఆధారపడి సీట్ షేరింగ్ ఉంటుందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో మా బలం ఎక్కువ.. కొన్ని జిల్లాల్లో తక్కువ.. కానీ, జనసేనకు పట్టున్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని తెలిపారు.