Ramakrishna: పొత్తులపై సీపీఐ రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్‌కు ఆ విషయం చెబుతాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramakrishna: ఆంధ్రప్రదేశ్‌లో గత కొంత కాలంగా ఎన్నికల పొత్తులపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళ్తాయా? లేదా టీడీపీ, జనసేన మాత్రమే ఎన్నికలు వెళ్తాయా అనే విషయం తెలియాల్సి ఉంది.. ఇక, బీజేపీని దూరంగా పెడితే తాము కూడా పొత్తుకు సై అంటున్నాయి కమ్యూనిస్టు పార్టీలు.. పొత్తులపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పార్టీలతో మేం కలిసి పనిచేస్తున్నాం.. మేం అందరం కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు.. అయితే, బీజేపీతో కలసి పోటీ చేయవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెబుతాం అన్నారు. పాచిపోయిన లడ్డూలు.. మంచి లడ్డూలు ఎలా అయ్యాయో పవన్ కల్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు సీపీఐ నేత రామకృష్ణ.
Read Also: CM YS Jagan: టెన్త్ టాపర్లకు సీఎం జగన్ గుడ్‌న్యూస్..
Also Read
- Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
- Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
మరోవైపు.. పోలీసుల దయా దాక్షిణ్యాలపై ఆధారపడేలా జీవో 1 ఉందన్నారు రామకృష్ణ.. విజ్ఞత లేకుండా మరల జీవో ఇస్తామనడం పోలీసు రాజ్యం నడపాలనా? పోలీసు రాజ్యం నడపడానికి సీఎం అవసరమా? అని ప్రశ్నించారు. పోలీసు రాజ్యం నడపాలంటే డీజీపీని సీఎం సీట్లో కూర్చోపెట్టాలన్న ఆయన.. కొత్త జీవో తెస్తే మేం ప్రత్యక్ష ఆందోళనకు సమాయుత్తం అవుతాం అన్నారు.. ఇళ్ల స్ధలాల అంశం కంటే ముందు అమరావతి రాజధాని ఉందా లేదా చెప్పాలి అని డిమాండ్ చేశారు.. రాజధాని విశాఖపట్నమా..? అమరావతా..? స్పష్టమైన ప్రకటన ఇవ్వాలన్న ఆయన.. సెంటు భూమి ఏం చేసుకోవాలి.. నీ బాత్ రూం అంత కూడా పేదవాడికి ఇవ్వరా..? అని ఫైర్ అయ్యారు. పేదవారిని బిక్షగాళ్ళుగా మారుస్తున్నారు.. ఇందిరాగాంధీ హయాంలో 5 సెంట్లు ఇచ్చారు.. ఇప్పుడు సెంట్ భూమి ఏం చేసుకోవాలని అని నిలదీశారు. రెండు లేదా మూడు సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక, సిమెంట్ ఉచితంగా ఇచ్చి.. ఒకొక్కరికి 5 లక్షలు ఇవ్వాలని కోరారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Electricity Meter Red Light Blinking: కరెంట్ బిల్లు భారీగా వస్తుందా? మీటర్ ముందే ఇచ్చే సంకేతం ఇదే.. కచ్చితంగా తెలుసుకోండి..
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!