కోడిగుడ్డు శాఖాహారమా లేక మాంసాహారమా అనే దానిపై చాలా మంది మల్లగుల్లాలు పడుతుంటారు. ఎగ్ శాఖాహారమై అని కొందరూ, కాదు కాదు మాంసాహరమని మరికొందరు చెబుతుంటారు. అయితే, కోడి నుంచి వస్తుంది కాబట్టి ఎగ్ అనేది మాంసాహారమే అని వాదించేవారికి అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు తమ పరిశోధనలతో చెక్ పెట్టారు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎగ్ అన్‌ఫెర్టిలైజర్ గుడ్డు అని, ఇందులో ఎలాంటి మాంసాహారం ఉండదని, ఎగ్ వైట్‌లో ప్రోటీన్లు మాత్రమే ఉంటాయని శాస్త్రవేత్తలు చెప్పారు. …
ప్రభుత్వానికి కొన్నిసార్లు ప్రజల నుంచి నిరసన వ్యక్తం అవుతూనే ఉంటుంది.. ప్రజలు కాకపోయినా.. ప్రతిపక్షాలు అధికార పార్టీని టార్గెట్ చేస్తూ.. కొన్ని అంశాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇలా ప్రజా ప్రతినిధులతో పాటు.. కొన్నిసార్లు అధికారులను కూడా అడ్డుకోవడం, నిరసన వ్యక్తం చేయడం, ఆందోళన తెలపడం.. ఇక దాడులకు పాల్పడిన సందర్భాలు కూడా లేకపోలేదు.. తాజాగా, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్‌పై కోడిగుడ్లతో దాడి చేశారు బీజేవైఎం కార్యకర్తలు… ఇవాళ పూరీ సిటీలో పర్యటించారు సీఎం నవీన్…
భూమిపై ఎన్నో వింతు విడ్డూరాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ ఎలాంటి విచిత్రాలు జరుగుతాయో ఎవరికీ తెలియదు. వింతలూ, విశేషాలు కామన్. అయితే, కొన్ని వింతలు చాలా విచిత్రంగా ఔరా అనిపించే విధంగా ఉంటాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఇలాంటి వింతైన సంఘటన ఒకటి ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయి జిల్లా హరియావా గ్రామంలోని శారదానది ఉన్నట్టుండి గుడ్లనదిలా మారిపోయింది. వేలాది గుడ్లు నదిలో తేలాడుతూ కనిపించాయి. దీంతో హరియావా గ్రామస్తులు షాక్ అయ్యారు. ఒక్కసారిగా నదిలో…
దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనం చేస్తూ దొరికిపోతే దానికంటే అవమానం ఏముంటుంది. పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ టౌన్ లోని ఓ పోలీసు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రోడ్డుపై పెట్టిన కోడిగుడ్ల బండి వద్దకు వెళ్లిన పోలీస్ అందులోనుంచి కొన్ని గుడ్లను తీసుకొని జేబులో వేసుకున్నాడు. బండి డ్రైవర్ రాగానే తనకేమి తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోడిగుడ్ల…