దొంగలను పట్టుకోవాల్సిన పోలీసులు దొంగతనం చేస్తూ దొరికిపోతే దానికంటే అవమానం ఏముంటుంది. పంజాబ్ లోని పతేఘర్ సాహిబ్ టౌన్ లోని ఓ పోలీసు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. రోడ్డుపై పెట్టిన కోడిగుడ్ల బండి వద్దకు వెళ్లిన పోలీస్ అందులోనుంచి కొన్ని గుడ్లను తీసుకొని జేబులో వేసుకున్నాడు. బండి డ్రైవర్ రాగానే తనకేమి తెలియనట్టు అక్కడి నుంచి తప్పుకున్నాడు. అయితే, ఈ తతంగం మొత్తాన్ని ఓ వ్యక్తి మొబైల్ లో వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో కోడిగుడ్ల దొంగతనానికి పాల్పడిన పోలీస్ ప్రీత్ పాల్ సింగ్ ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.