కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.