MUDA scam: కర్ణాటకలో సంచలనంగా మారిన మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) కుంభకోణంలో సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన భార్యకు సంబంధం ఉందని ఈడీ పేర్కొంది. సిద్ధరామయ్య, ఆయన భార్య, ఆయన కుటుంబ సభ్యులకు ఈ స్కామ్‌లో సంబంధం ఉందని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వెల్లడించింది. ప్రభుత్వం సేకరించిన భూమిని అక్రమంగా డీ-నోటిఫై చేయడం, మోసపూరిత భూమి మార్పిడి , సుమారు రూ.56 కోట్ల విలువైన సైట్
తమిళనాడు ప్రభుత్వంలో మంత్రి అనితా ఆర్. రాధాకృష్ణన్‌పై ఈడీ కీలక చర్యలు తీసుకుంది. మనీలాండరింగ్ కేసులో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన రూ.1.26 కోట్ల విలువైన ఆస్తులను దర్యాప్తు సంస్థ జప్తు చేసింది. తూత్తుకుడి, మదురై, చెన్నైలలో అనితా రాధాకృష్ణన్‌కు చెందిన స్థిరాస్తులను అటాచ్ చేయాలని పీఎంఎల్‌ఏ కింద ఆదేశాలు జారీ చేసినట్లు ఈడీ తన ప్రకటనలో తెలిపింది.
Muda Scam: కర్ణాటకలో ముడా కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముడాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు ఇతరులకు చెందిన 300 కోట్ల రూపాయల విలువైన 140 స్థిరాస్థుల్ని అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది.
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్‌ను అధికారులు విచారిస్తున్నారు. గంట నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపు పైనే ఈడీ ఫోకస్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది.…
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఈడీ ఆఫీస్‌కు భారీ ఎత్తున బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. దీంతో ఈడీ ఆఫీస్ ముందు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో బీఆర్‌ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేటీఆర్ ఈడీ విచారణకు హాజరైన నేపథ్యంలో…
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై…
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉన్నా.. తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఓవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో…
మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో జనవరి 7న నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు.. 16న విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం 10 నందినగర్‌లోని తన నివాసం నుంచి కేటీఆర్ బయలుదేరి.. 10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు. ఫార్ములా-ఈ రేస్ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది.…