ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ఈడీ కార్యాలయంలో కేటీఆర్‌ను అధికారులు విచారిస్తున్నారు. గంట నుంచి విచారణ కొనసాగుతోంది. విచారణలో భాగంగా కేటీఆర్ నుంచి కీలక సమాచారంను ఈడీ అధికారులు రాబడుతున్నారు. నిధుల బదలాయింపు పైనే ఈడీ ఫోకస్ పెట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేకుండా నిధులు ఎలా మళ్లించారన్న దానిపైనే ఈడీ ప్రశ్నలు సంధిస్తోంది.
కేటీఆర్ ఆదేశాలతోనే ఎఫ్‌ఈఓకు నిధులు పంపామని అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డిలు ఇప్పటికే చెప్పారు. వారిపై ఎందుకు ఒత్తిడి తెచ్చారని కేటీఆర్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఆర్‌బీఐ నిబంధనలు పాటించలేదని కేటీఆర్ నుంచి రాబడుతోంది. ఆరు ప్రశ్నలపైనే ఈడీ అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫెమా చట్టంను ఏ విధంగా ఉల్లంఘించారు, డబ్బును విదేశాలకు ఎలా తరలించారు అనే దానిపై ప్రధానంగా కేటీఆర్‌ను విచారిస్తున్నారు.
Also Read: Jaipal Reddy: రాజకీయ నాయకులు ఆదర్శంగా తీసుకోవాల్సిన వ్యక్తి జైపాల్ రెడ్డి: జీవన్ రెడ్డి
జనవరి 7న ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవాల్సి ఉంది. అయితే ఏసీబీ కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఆ తీర్పు వచ్చేవరకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు. దీంతో 16న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో నేడు విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ తన నివాసం నుంచి కాకుండా.. ఫామ్ హౌస్ నుంచి విచారణకు వచ్చారని తెలుస్తోంది. విచారణ నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. ఈడీ ఆఫీస్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీ భవన్ వద్ద భారీ బందోబస్తు చేపట్టారు.