KTR: ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు.. న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం!
- ఈడీ విచారణకు కేటీఆర్
- ఫార్ములా-ఈ రేస్ కేసులో A-1గా కేటీఆర్
- కేటీఆర్ ట్వీట్ వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరుకానున్నారు. ఈడీ విచారణకు ఈ నెల 7న హాజరుకావాల్సి ఉన్నా.. తాను రాలేనని కేటీఆర్ చెప్పడంతో 16న విచారణకు హాజరు కావాలని ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఓవైపు ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. మరోవైపు ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసింది. ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదని, ప్రతి రూపాయికి లెక్క ఉంటుందన్నారు. త్వరలో నిజం వెల్లడి అవుతుందని, అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం అని కేటీఆర్ పేర్కొన్నారు.
Also Read: BCCI: బీసీసీఐ కఠిన ఆంక్షలు.. ఇక నుంచి వారం రోజులు మాత్రమే!
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
‘భారతదేశం/తెలంగాణ/హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ హోస్ట్ చేయడం మంత్రిగా నా అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్ణయాలలో ఒకటి. అంతర్జాతీయ రేసర్లు, ఇ-మొబిలిటీ పరిశ్రమ నాయకులు మా నగరాన్ని ప్రశంసించడం గర్వించదగ్గ విషయం. పనికిమాలిన కేసులు, చౌకగా బురదజల్లడం, రాజకీయాలు చేయడం ద్వారా ఆ మంచి పనిని తొలగించలేవు. నాకు బ్రాండ్ హైదరాబాద్ అత్యంత ముఖ్యమైనది. నిన్న, నేడు, రేపు మరియు ఎల్లప్పుడూ ఫార్ములా ఈ రేస్ మన నగరాన్ని అంతర్జాతీయ క్రీడా వేదికపై నిలబెట్టింది. బ్యాంక్-టు-బ్యాంక్ లావాదేవీ ద్వారా ఫార్ములా ఈ రేస్ ఆపరేషన్స్ లిమిటెడ్ కి రూ. 46 కోట్లు చెల్లించబడింది. ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం కాలేదు, ప్రతి రూపాయికి లెక్క ఉంటుంది. ఇందులో అవినీతి, దుర్వినియోగం, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది?. ఏదైతేనేం సీఎం రేవంత్ రెడ్డి చిన్న చూపు, ఆయన ఆలోచనా రహిత, ఏకపక్ష నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిన కార్యక్రమం రెండో ఏడాది రద్దు. గౌరవనీయమైన కోర్టులతో సహా అందరికీ కనిపించేలా త్వరలో నిజం వెల్లడి అవుతుందని నేను విశ్వసిస్తున్నా. అప్పటి వరకు న్యాయం కోసం పోరాటం కొనసాగిస్తాం’ అని ఎక్స్‌లో కేటీఆర్ రాసుకొచ్చారు.
Hosting Formula E in India/Telangana/Hyderabad remains one of my most cherished decisions as a Minister. The pride I felt, witnessing international racers & E-Mobility industry leaders praise our city, is memorable
No amount of frivolous cases, cheap mudslinging, or political…
— KTR (@KTRBRS) January 16, 2025
- Tags
- BRS
- ED
- Formula E Case
- ktr
- telangana
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!