ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట హాజరయ్యారు. గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి గురువారం ఉదయం 10 గంటలకు బయల్దేరిన కేటీఆర్.. నేరుగా బషీర్‌బాగ్‌లోని ఈడీ ఆఫీస్‌కు 10.30కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 200 మంది పోలీసులు కార్యాలయం వద్ద మోహరించారు. హెచ్‌ఎండీఏ ఖాతా నుంచి విదేశీ సంస్థకు నిధుల బదిలీపై ఈడీ అధికారులు కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: Enumamula Agriculture Market: తెరుచుకున్న వరంగల్ ఎనుమాముల మార్కెట్.. పోటెత్తిన తెల్ల బంగారం!
ఫెమా రూల్స్‌ని అతిక్రమిస్తూ కేటీఆర్ విదేశాలకు రూ.55 కోట్లు తరలించారని ఆయనపై అభియోగం ఉంది. ఈ కేసులో కేటీఆర్‌పై ఫెమా ఉల్లంఘనతో పాటు మనీ లాండరింగ్ కేసు కూడా నమోదయింది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ A-1గా ఉన్నారు. ఈ కేసులో A2, A3గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్, బీఎన్‌ఎల్ రెడ్డిలను ఈడీ ఇప్పటికే విచారించింది. వారు ఇద్దరు ఇచ్చిన స్టేట్‌మెంట్స్ ఆధారంగా ఈడీ నేడు కేటీఆర్‌ని ప్రశ్నిస్తోంది. ఫార్ములా ఈ రేస్‌లో నిబంధనల ఉల్లంఘనపై ఏసీబీ దర్యాప్తు చేస్తుండగా.. ఆర్బీఐ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై ఈడీ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.