యువత ప్రాణాలను బలి తీసుకుంటున్న బెట్టింగ్ యాప్స్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. బెట్టింగ్ యాప్స్ పై తెలంగాణలో ప్రభుత్వం సీరియస్ గా ఉంది. బెట్టింగ్ యాప్స్ విషయంలో కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు.. మరోపక్క బెట్టింగ్ యాప్స్ కేసును PMLA చట్ట కింద కేసునమోదు చేసిన ఈడి సైతం, ప్రమోట్ చేసిన సెలబ్రిటీలను విచారిస్తుంది. అయితే దేశంలో బెట్టింగ్ యాప్స్ ను పూర్తిగా నిషేధించాలని సుప్రీంకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…
రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.17,000 కోట్లు విలువైన లోన్ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది.
Myntra: భారత్ లో ఆన్లైన్ సేవలను అందించే మింత్రాకు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఝలక్ ఇచ్చింది. ఫ్యాషన్, సంప్రదాయ దుస్తులకు నిలయంగా మారిన ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ మింత్రా (Myntra) ఇప్పుడు విదేశీ పెట్టుబడుల నిబంధనలను (FDI Norms) ఉల్లంఘించినట్లు ఈడీ గుర్తించి దర్యాప్తు మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1,654 కోట్ల విలువైన పెట్టుబడుల ఉల్లంఘనపై ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) 1999 కింద కేసు నమోదు చేసింది ఈడీ. Mission Impossible…
Chhangur Baba: ఉత్తర్ ప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అరాచకాలు సంచలనంగా మారాయి. ఆధ్యాత్మకవేత్త ముసుగులో పెద్ద ఎత్తున మతమార్పిడులకు పాల్పడున్న రాకెట్ బయటపడింది. ఈ రాకెట్ దేశవ్యాప్తంగా విస్తరించి ఉండటం అధికారులను నివ్వెరపరుస్తోంది. ‘‘లవ్ జిహాద్’’ని ఆయుధంగా చేసుకుని పలువురు ముస్లిం యువకులు, హిందూ అమ్మాయిలను ప్రేమించి, పెళ్లి చేసుకుని, మతం మారుస్తున్న విషయాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు కొనసాగిస్తోంది. సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. హెచ్ సీఏలో లో క్విడ్ ప్రో కో జరిగినట్టు ఈడి గుర్తించింది. టెండర్లు లేకుండా అనుకూలమైన వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు ఈడి గుర్తించింది. కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్, అతడి భార్యను విచారించింది ఈడీ. రూ. 90 లక్షల రూపాయలు క్విడ్ ప్రో కో జరిగినట్టు…
HCA President Jaganmohan Rao Scam: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. హెచ్‌సీఏ స్కామ్‌పై పూర్తి వివరాలు కావాలని తెలంగాణ నేర పరిశోధన విభాగం (సీఐడీ)ను ఈడీ కోరింది. హెచ్‌సీఏలో పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేసింది. హవాలా, మనీ లాండరింగ్ రూపంలో లావాదేవీలు జరిగినట్టుగా ఈడీ అనుమానిస్తోంది. హెచ్‌సీఏ కమిటీ సభ్యులు పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంచైజీ…
Nehal Modi: పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారీ నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీని అమెరికాలో అధికారులు అరెస్ట్ చేశారు. భారత అప్పగింత అభ్యర్థన మేరకు అమెరికా అధికారులు ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. నేహాల్ మోడీని కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కుంభకోణానికి సంబంధించి అమెరికాలో అరెస్టు చేశారు, ఇది భారతదేశానికి పెద్ద దౌత్య విజయం. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ ప్రకారం, బెల్జియన్ జాతీయుడైన నేహాల్ మోడీని జూలై 4న అదుపులోకి తీసుకున్నారు.
డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఈడీ) హైదరాబాద్ జోన్ కార్యాలయం, అగ్రి గోల్డ్ గ్రూప్ కంపెనీలు నడిపిన పొంజీ స్కీమ్ బాధితులకు సంబంధించి రూ. 611 కోట్ల విలువైన ఆస్తులను పునరుద్ధరించడం ద్వారా మరోసారి విజయాన్ని సాధించింది. అటాచ్ మెంట్ సమయంలో వీటి విలువ రూ.611 కోట్లు కాగా, ప్రస్తుత మార్కెట్ విలువ రూ.1000 కోట్లు మించిపోయే అవకాశం ఉంది. ఈ ఏడాది మే నెలలో ఈడీ, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) 2002 సెక్షన్ 8(8) కింద…
Udhayanidhi Stalin: తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షత శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం స్టాలిన్ పాల్గొనడంపై ప్రతిపక్షాల ఆరోపణల్ని ఆయన తిప్పికొట్టారు. డీఎంకే నాయకత్వం ఈడీ లేదా ప్రధాని మోడీకి భయపడదని అన్నారు. తమిళనాడు ప్రజలకు సరైన ఆర్థిక కేటాయింపులు సాధించాలనే ఆసక్తితోనే ముఖ్యమంత్రి న్యూఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
National Herald Case: నేషనల్ హెరాల్డ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సంచలన ఆరోపణలు గుప్పించింది.