ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి ఈడీ అధికారులను రావాలని కోరింది. ఈ క్రమంలో నోటీసులు జారీ చేశారు. 8, 9వ తేదీల్లో బీఎల్‌ఎన్‌రెడ్డి, అరవింద్‌కుమార్‌లు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి ఈడీ నోటీసులపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు.. కేటీఆర్ ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించారని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ఒక్క రూపాయి ఖర్చు చేసిన అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.. ఇటు కేంద్ర ప్రభుత్వం, అటు ఆర్బీఐకి చెప్పకుండా మన రాష్ట్ర సొమ్ముని దేశ ఫారెన్ కంపెనీల కోసం ఖర్చు పెట్టారని రఘునందన్ రావు ఆరోపించారు.
Formula E Car Race Case: ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో వివరాలను ఏసీబీ శనివారం ఈడీకి అందజేసింది. ఆర్థిక శాఖ రికార్డ్స్, HMDA చెల్లింపుల వివరాలు, HMDA చేసుకున్న ఒప్పంద పత్రాలతో పాటు FIR ఈడీకి అందజేసింది.
ఫార్ములా ఈ-కార్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ దర్యాప్తు ఆధారంగా కేసు నమోదు చేసింది ఈడీ. ఫార్ములా ఈ-కార్ రేసులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ కేసు నమోదు చేశారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసులో ప్రమేయం ఉన్న కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసింది. ECIR నమోదు చేసినట్లు ఈడీ పేర్కొంది.
P. Chidambaram: ఎయిర్‌సెల్- మ్యాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికింది.
Amanatullah Khan : ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు రూస్ అవెన్యూ కోర్టు నుంచి పెద్ద ఊరట లభించింది. మనీలాండరింగ్ కేసులో అతనిపై దాఖలైన అనుబంధ చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి కోర్టు నిరాకరించింది. అతడిని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఏం చెప్పింది? అమానతుల్లా ఖాన్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని, అయితే అతనిని ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి లేదని, అందుకే కాగ్నిజెన్స్ నిరాకరించినట్లు కోర్టు తెలిపింది. రూ. లక్ష…
అగ్రి గోల్డ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్‌ని నాంపల్లి ఎంఎస్‌జే కోర్టు పరిగణలోకి తీసుకుంది. మొత్తం 32 లక్షల ఖాతాదారుల నుంచి రూ. 6,380 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. అలాగే.. 4,141 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
Mahadev Betting App: ‘‘మహాదేశ్ బెట్టింగ్ యాప్’’ దేశవ్యాప్తంగా గతేడాది సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ బెట్టింగ్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్ని దుబాయ్ అధికారులు అరెస్ట్ చేశారు. మనీలాండరింగ్, మోసం కేసుల్లో ఇంటర్‌పోల్ జారీ చేసిన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈడీ అభ్యర్థన మేరకు ఈ బెట్టింగ్ యాప్‌లో మరో ప్రమోటర్ గా ఉన్న రవి ఉప్పల్‌ని గతఏడాది చివర్లో దుబాయ్‌లో అదుపులోకి తీసుకుని ‘‘హౌజ్ అరెస్ట్’’ చేశారు. చంద్రశేఖర్, రవి ఉప్పల్…
Mahadev Betting App: గతేడాది జరిగిన ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల టైంలో వెలుగులోకి వచ్చిన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మరో కీలక పరిణామం నెలకొంది. ఈ యాప్ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్ చంద్రకర్‌ను దుబాయ్‌లో ఇటీవల అరెస్టు చేశారు.
Manipur Congress Chief: మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్ల జారీ చేసింది. మణిపూర్ పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి ఎన్ బుపెండా మెయిటే మాట్లాడుతూ.. ఈడీ ప్రతీకార రాజకీయాలకు దిగుతుందని విమర్శించారు.