Skill Development Scam: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కీలక మలుపు తిరుగుతోంది.. పెద్దస్థాయి అరెస్టులు జరిగే అవకాశం కనిపిస్తోంది.. అప్పట్లో స్కిల్‌డెవలప్‌మెంట్ అధికారిగా పనిచేసిన అర్జా శ్రీకాంత్‌పై విచారణకు సిద్ధం అవుతున్నారు సీఐడీ అధికారులు.. నోటీసులు జారీచేసేదిశగా సీఐడీ అధికారులు సిద్ధం అవుతున్నారు.. ఈ కేసులో మరింత మంది కీలక వ్యక్తులను అరెస్ట్ చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు.. తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్న స్కిల్‌డెవలప్‌మెంట్ కేసు.. గతంలో చంద్రబాబు హయాంలో నైపుణ్యాభివృద్ధిపేరిట ప్రాజెక్టు చేపట్టారు.. సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ రూ.3300 కోట్లు ప్రాజెక్టు చేపట్టారు.. సీమెన్స్ – డిజిటల్ టెక్ మధ్య ఒప్పందం కుదిరింది.. ప్రభుత్వం నుంచి 10 శాతం మేర చెల్లింపులు జరిగాయి.. మిగిలిన 90 శాతం సీమెన్స్ చెల్లిస్తుందని ఒప్పందం.. 10 శాతం వాటాగా జీఎస్టీతో కలిపి రూ.370 కోట్లు చెల్లించింది చంద్రబాబు ప్రభుత్వం.. అయితే, చివరకు తమకు సంబంధం లేదని సీమెన్స్ అంతర్జాతీయ సంస్థ ప్రకటించింది.. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడి అయ్యాయి..
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇక, రాష్ట్ర ప్రభుత్వం కట్టిన డబ్బును వేర్వేరు షెల్ కంపెనీలకు మళ్లించినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఎలైట్ కంప్యూటర్స్, స్కిల్లర్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్, నాలెడ్జ్ పోడియం, ఈటీఏ- గ్రీన్స్, కేడన్స్ పార్టనర్ తదితర కంపెనీలకు ఈ డబ్బు మళ్లించారు. రూ. ౩౭౦ కోట్లలో రూ.240 కోట్లు రూటింగ్ చేసినట్టు చెబుతున్నారు.. సీమెన్స్‌లో ఎండీగా ఉన్న సుమన్ బోస్, డిజైన్ టెక్ ఎండీ వికాస్ కన్వికర్‌ల ద్వారా కుంభకోణం నడిపినట్టు ఆరోపణలు ఉన్నాయి.. రూ.3300 కోట్ల ప్రాజెక్టుగా ఎంఓయూ.. కానీ, జీవో దగ్గరకు వచ్చేసరికి రూ.3300 కోట్ల ప్రస్తావనను తొలగించింది చంద్రబాబు ప్రభుత్వం. చివరకు రూ.240 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల ద్వారా లాగేసిన వైనాన్ని గుర్తించారు.. 2016-18 మధ్య మొత్తం స్కాం జరిగింది.. ఈ కుంభకోణంలో గతంలోనే ఏసీబీకి ఫిర్యాదు చేశారు విజిల్ బ్లోయర్.. వెంటనే అసలు ఫైళ్లను చంద్రబాబు ప్రభుత్వం మాయం చేసినట్టు విమర్శలు ఉన్నాయి.. అధికారులను మేనేజ్ చేసే సమయంలో.. కేంద్రం ప్రభుత్వ జీఎస్టీ అధికారుల దర్యాప్తులో బయటపడింది..
ఈ స్కాంపై దృష్టిపెట్టిన కేంద్రం ఆదాయపుపన్ను శాఖ.. గ్లోబల్ సంస్థ సీమెన్స్ ఇంటర్నెల్ టీంకూడా మా కంపెనీ పేరుమీద మోసాలకు పాల్పడ్డారని తేల్చింది.. ఈ సంస్థలన్నింటితో కో-ఆర్డినేట్ చేసింది సీఐడీ.. తమకు ఎలాంటి సంబంధం లేదని, తమ పేరుమీద మోసం జరిగిందని పూర్తిగా ఆధారాలిచ్చింది.. నేరుగా వచ్చి వివరణ ఇచ్చారు సీమెన్స్… సీమెన్స్ పేరిట ఈ మోసాలకు పాల్పడ్డారని సీఐడీ తేల్చింది.. దీనికి సహకరించిన ఆనాటి అధికారులు కూడా కోర్టుకు ముందుకు వచ్చిన స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీంతో పెద్దస్థాయిలో అరెస్టులకు సీఐడీ సిద్ధం అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది.. మరోవైపు.. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం అంశంపై ఎన్టీవీకి వివరణ ఇచ్చారు అర్జా శ్రీకాంత్.. స్కిల్ కుంభకోణానికి, నాకు సంబంధం లేదన్న ఆయన.. కుంభకోణం జరిగిన సమయంలో నేను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో లేను అని స్పష్టం చేశారు.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎమ్‌డీగా నేను 2019 మార్చి నెలలో బాధ్యతలు తీసుకున్నాను.. కుంభకోణం 2014-2017 మధ్య కాలంలో జరిగింది అంటున్నారు.. కుంభకోణానికి సంబంధించి కార్పొరేషన్ ఎమ్‌డీగా నేను ఒక సమగ్ర నివేదిక ఇచ్చాను.. ఆ నివేదిక పై మరిన్ని వివరాల కోసం సీఐడీ నాకు 160 కింద నోటీసు ఇచ్చిందని.. ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారని శ్రీకాంత్ చెబుతున్నారు..