Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో దక్షిణాదితో ఉన్న సంబంధం వెలుగులోకి వచ్చింది. దీంతో వివరణాత్మక సమాచారం కోసం ఈడీ అరవింద్ కేజ్రీవాల్, కె. కవితను ముఖాముఖిగా కూర్చోబెట్టి విచారించాల్సిన అవసరం ఉంది.
Delhi Liquor Scam : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిన్న రాత్రి విచారణ అనంతరం అరెస్టు చేసింది.
లిక్కర్ స్కాం కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పటికీ ఢిల్లీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆమ్ ఆద్మీ పార్టీ స్పష్టం చేసింది. జైలు నుంచి రాష్ట్రాన్ని నడిపించకుండా కేజ్రీవాల్ ను ఏ చట్టం ఆపదు అని పేర్కొన్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు సమీర్ మహేంద్రు, పి శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబు, విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్‌పల్లి, అమిత్ అరోరాలను అరెస్టు చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ రోజు ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసింది. ఈ అరెస్టులో లిక్కర్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ నేతల సంఖ్య 4కి చేరింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ కాగా ప్రస్తుతం కేజ్రీవాల్ కూడా అరెస్టయ్యాడు.
Congress: అరవింద్ కేజ్రీవాల్‌ని ఢిల్లీ మద్యం కేసులో ఈడీ ఈ రోజు అరెస్ట్ చేసింది. అరెస్ట్ నుంచి రక్షణ ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు పేర్కొన్న కొన్ని గంటల తర్వాత ఈడీ అధికారులు కేజ్రీవాల్ నివాసం సోదాలు నిర్వహించి, అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్‌పై ప్రతిపక్ష పార్టీలు కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తున్నాయి. కాంగ్రెస్‌తో పాటు ఇండియా కూటమిలోని పలు పార్టీలు బీజేపీపై తీవ్రస్థాయిలో దాడి చేస్తున్నారు.
Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Delhi Excise Policy Case : మద్యం పాలసీ విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా పదేపదే సమన్లు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.