Arvind Kejriwal arrest: ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఈ అరెస్ట్‌పై అమెరికా చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. అమెరికా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం మధ్యాహ్నం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను పిలిచింది. 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది.
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత దీపక్ సింగ్లా, చండీగఢ్ లోని ఆ రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజం నివాసాలతో సహా పంజాబ్ లోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ఏకకాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడులు కొనసాగుతున్న ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుతో ముడిపడి ఉన్నాయా అనేది స్పష్టంగా లేనప్పటికీ., జామ తోటల పరిహారం స్కామ్ సంబంధించి లింక్డ్ మనీ లాండరింగ్ కేసులో భాగంగా ఫెడరల్ ఏజెన్సీ దాడులు నిర్వహిస్తోందని…
ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడంపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టనుంది.
లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్నారు. అయితే, అక్కడి నుంచే ఆయన పాలన కొనసాగిస్తుండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
Himanta Biswa Sarma : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. అరెస్టును కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారని ఆయన అన్నారు.