ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి భయం.. అందుకే ఆయనను అరెస్ట్ చేయించారని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
INDIA bloc: ఢిల్లీ లిక్కర్ స్కాములో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన అరెస్టును కాంగ్రెస్, టీఎంసీలతో పాటు ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కేంద్రంలోని బీజేపీ ఖూనీ చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈడీ, సీబీఐ, ఐటీల వంటి కేంద్ర సంస్థల్ని బీజేపీ దుర్వినియోగం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు కేంద్ర ఏజెన్సీలతో ప్రతిపక్ష నేతల్ని భయభ్రాంతులకు గురిచేస్తుందని ఆరోపిస్తున్నారు.
Himanta Biswa Sarma : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సంచలన ప్రకటన చేశారు. అరెస్టును కేజ్రీవాల్ స్వయంగా ఆహ్వానించారని ఆయన అన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఇది మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని కేంద్ర విదేశాంగ శాఖ అభ్యంతరం వ్యక్తం చేసింది.
AAP: ఢిల్లీలో మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) చీఫ్ జెపి నడ్డాను కూడా అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది.
ED Raids : ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ నేపథ్యంలో మరో పార్టీ ఎమ్మెల్యేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ చర్యలు తీసుకుంది. ఆప్‌కి చెందిన మటియాలా ఎమ్మెల్యే గులాబ్ సింగ్ యాదవ్‌పై ఈడీ పట్టు బిగించింది.
Delhi liquor policy scam: మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోరుతూ ఈ రోజు రోస్ ఎవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ కేజ్రీవాల్‌ని కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరుతోంది. ఈడీ తరుపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు కేజ్రీవాల్‌కి 10 కస్టడీని కోరారు. ఈడీ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో మొత్తం ఢిల్లీ మద్యం కుంభకోణంలో ‘‘కింగ్‌పిన్’’ అరవింద్ కేజ్రీవాల్ అని తెలిపింది. ఇతను ‘‘సౌత్ లాబీ’’కి అనుకూలంగా…