Punjab CM: మీరు కేవలం కేజ్రీవాల్ను అరెస్ట్ చేయగలరు.. ఆయన ఆలోచనను కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ ) అరెస్టు చేయడాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా ఖండించారు. ‘మీరు కేవలం కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు.. కానీ ఆయన ఆలోచనను బంధించలేరు అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్ ఒక వ్యక్తి కాదు.. ఆలోచనా విధానం.. తామంతా ఆయనతోనే నిలబడతామని ఆయన ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీపై నిప్పులు కురిపించారు.
Read Also: Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!
Also Read
అయితే, నోటీసులు ఇస్తామంటూ ఢీల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. ఆ తర్వాత సోదాలు చేసి.. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాల్సిందిగా కేజ్రీవాల్‌కు అధికారులు తెలిపారు.. అందుకు ఆయన నిరాకరించడంతో ఇంట్లోనే విచారించాలని కోరారు. కాసేపటి తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. ఇక, రాత్రి అంతా ఢిల్లీ సీఎం ఈడీ కస్టడీలోనే ఉన్నారు. కాగా, కేజ్రీవాల్‌ను ఇవాళ ప్రత్యేక పీఎంఎల్‌ఏ కోర్టులో ఈడీ అధికారులు హాజరు పర్చనున్నారు. విచారణ కోసం ఈడీ ఆయనను కస్టడీకి ఇవ్వాలని కోరనుంది. దాదాపు 13 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంది. ఇక, అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మద్దతుదారులు నేడు ఆందోళనకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.
"You will arrest Arvind Kejriwal but how will you arrest his thinking… Arvind Kejriwal is not a person but an idea and we stand with our leader like a rock…," tweets Punjab CM and AAP leader Bhagwant Mann pic.twitter.com/r1QMmIkyBs
— ANI (@ANI) March 22, 2024
తాజావార్తలు
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!