Delhi Liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన నాలుగో ఆప్ నేత కేజ్రీవాల్, ఆయన కన్నా ముందు ఆ పార్టీకి చెందిన సత్యేందర్ జైన్, మనీష్ సిసోడియా, సంజయ్ సింగ్ అరెస్ట్ అయ్యారు.
Delhi Excise Policy Case : మద్యం పాలసీ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ద్వారా పదేపదే సమన్లు పంపడంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ పై ఈడీ సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 15వ తేదీన కవితను అరెస్ట్ చేశామని.. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు కవితను ఏడు రోజుల కస్టడీకి అనుమతించిందని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు కవిత ఈడీ కస్టడీలో ఉంటుందని పేర్కొంది. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నామని తెలిపింది.
MLC Kavitha Husband Anil: ఎమ్మెల్సీ కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త అనిల్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయనున్నారు. ఈడీ ఆమెను అక్రమంగా అరెస్టు చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నారు.
ఢిల్లీ ఈడీ కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ పూర్తి అయింది. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేశారు. విచారణ తర్వాత కవితను ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, బావ హరీశ్ రావు కలిశారు. కవిత యోగ, క్షేమాలను వీరు కనుక్కున్నారు. ఈ కేసులో న్యాయపోరాటం చేద్దామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాది మోహిత్ రావు కూడా కవితను కలిశారు. ఇదిలా ఉంటే.. రేపు సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత భర్త కంటెంప్ట్…
MLC Kavitha: తనపై తప్పుడు కేసు పెట్టారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని అన్నారు. అక్రమ అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత.
RS Praveen Kumar: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె అరెస్టుపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఎమ్మెల్సీ కవితకు మరోసారి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఇవాళ ఉదయం మహిళా వైద్యుల బృందం ఇడి కేంద్ర కార్యాలయం పరివర్త్ భవన్‌కు వెళ్లి కవితకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
Arvind Kejriwal : మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మరోసారి చిక్కుముడి వీస్తున్నట్లు కనిపిస్తోంది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు.