సార్వత్రిక ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌పై వేటు పడింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ అరవింద్ కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికలకు ముందు ఉద్దేశపూర్వకంగానే అరెస్టు చేశారన్నది కోర్టు ముందు కేజ్రీవాల్ వాదన వినిపించారు. అనంతరం.. కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో.. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో మార్పు జరిగింది. తొలుత మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఆప్ సర్కిల్‌లో.. సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు రాఘవ్ చద్దా.. అదేనండీ.. ఆప్ రాజ్యసభ సభ్యుడు, యంగ్ లీడర్ రాఘవ్ చద్దా. ఆప్‌లో చాలా చురుగ్గా ఉండే ఈ రాఘవ్ చద్దా.. గత కొద్ది రోజుల నుంచి పత్తాలేకుండా పోయారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉగాది రోజున హైకోర్టు విచారించనుంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ కేజ్రీవాల్ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం తీర్పు వెలువరించనుంది.
CM Kejriwal : మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈడీ అరెస్టు చేసిన తర్వాత ఇప్పుడు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ పొందిన తరువాత తీహార్ జైలుకు పంపబడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన పేరు రావడంతో మంత్రి అతిషి ఇవాళ స్పందించారు. ఈ సందర్భంగా మంత్రి అతిషి మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై సంచలన ఆరోపణలు చేశారు.
Sunita Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేయడంపై ఈ రోజు రామ్ లీలా మైదానంలో ‘లోక్తంత్ర బచావో’ పేరుతో ఇండియా కూటమి మెగా ర్యాలీ నిర్వహించింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్ హాజరయ్యారు. దాదాపు 5 గంటల పాటు ఆయన్ను ఈడీ అధికారులు విచారించారు.