Hemant Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్, ఈడీ చర్యకు వ్యతిరేకంగా ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. భూ కుంభకోణం కేసులో అరెస్టయిన హేమంత్ సోరెన్ తన పార్టీని ప్రమోట్ చేయడానికి ఎన్నికల సమయంలో బయటకు రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో జరిగిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును వ్యతిరేకిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ (సోమవారం) విచారణ చేపట్టనుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్నారు. ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయకుండా అక్కడ నుంచే విధులు నిర్వహిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఇక సెకండ్ విడత శుక్రవారమే జరగనుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కస్టడీని కోర్టు పొడగించింది. మరో 14 రోజుల పాటు అతను జైలులోనే ఉండాలి.
గత కొద్ది రోజులుగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోగ్యంపై ఈడీ-ఆప్ ప్రభుత్వం మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. తీహార్ జైలు వేదికగా కేజ్రీవాల్‌ను చంపేందుకు ఈడీ కుట్ర చేస్తోందని ఆప్ సర్కార్ ఆరోపిస్తోంది.
Liquor Scam : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో రాష్ట్రంలో రూ. 2000 కోట్ల మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రిటైర్డ్ IAS (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్) అధికారిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద చర్య తీసుకుంది.
Aravind Kejriwal : మద్యం కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతిత తెలిసిందే. ఆయనకు చాలా కాలంగా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అదనపు సాధారణ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని నాలుగో సంవత్సరం లా విద్యార్థి గురువారం ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు.