ఈడీ పేరిట ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. హస్తం పార్టీపై కక్షపూరితంగానే కేంద్ర సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అప్రజాస్వామిక పద్దతిలో ఈడీ సోనియాగాంధీని విచారిస్తోందని వివమర్శించారు. ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే.. సోనియాపై ఈడీ కేసు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోనూ నేతలు ధర్నాకు దిగారు. నగరంలోని నెక్లెస్‌రోడ్‌లోని ఇందిరా…