తెలంగాణలో ఎంసెట్-2022, ఈసెట్-2022 ప్రవేశపరీక్షలకు నోటిఫికేషన్‌లను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఎంసెట్ కోసం ఏప్రిల్ 6 నుంచి మే 28 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. జూలై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష.. జూలై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రకటన చేసింది. ఎంసెట్ పరీక్ష కోసం దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు అయితే రూ.800.. ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.400 చెల్లించాల్సి ఉంది. మరోవైపు ఈసెట్…