ఐదు రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్టు ప్రకటించింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నది. నేర చరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్ ఇవ్వాలి అంటే ఎందుకు ఇవ్వాలి అనే దానిపై రాజకీయ పార్టీలు క్లారిటీ ఇవ్వాలని సీఈసీ తెలియజేసింది. కరోనా కారణంగా ఎన్నికల సమయాన్ని గంట పెంచుతున్నట్టు తెలియజేసింది. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని సీఈసీ తెలియజేసింది.
Read: ఐదు రాష్ట్రాల ఎన్నికలు: కోవిడ్ సేఫ్ ఎన్నికలు నిర్వహిస్తాం
యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయాన్ని రూ. 28 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అలానే గోవా, మణిపూర్‌లో పోటీ చేసే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును రూ. 28 లక్షలకు లిమిట్ చేసింది. రెండు డోసులు తీసుకున్న వారిని ఎన్నికల నిర్వాహణకు వినియోగిస్తామని తెలియజేసింది. ఎన్నికల అధికారులను ఫ్రంట్‌లైన్ వర్కర్ల జాబితాలో చేరుస్తున్నామని, వారికి బూస్టర్ డోస్ ఇస్తామని తెలియజేసింది.