రాజమండ్రిలో జిల్లా కోవిడ్ ఆస్పత్రిని సందర్శించిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి అనంతరం మాట్లాడుతూ… జిల్లాలో ప్రతీరోజు దాదాపు వెయ్యి కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 5 వేల మందికు పరీక్షలు నిర్వహిస్తుంటే 20 శాతం మందికి కరోనా నిర్ధారణ అవుతోంది. కోవిడ్ నిబంధనలు ప్రజలు బాధ్యతాయుతంగా పాటించాలి. రాత్రి కర్ఫ్యూ సమయం సహా అవసరమైతే తప్ప పగలు కూడా ప్రజలు బయట తిరగడం తగ్గించుకోవాలి. తల్లిదండ్రులు ఆస్పత్రుల్లో కోవిడ్ చికిత్సపొందుతుంటే వారి పిల్లలు ఇంటి దగ్గర అవస్థలు పడుతున్నారు. అటువంటి దయనీయమైన పరిస్థితులు చాలా కుటుంబాల్లో ఉంది.. విందులు వినోదాలు వేడుకలను వాయిదా వేసుకోవాలి. ప్రస్తుతం ప్రతీ రోజు 5 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నాము.. ఆ సంఖ్య పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. రేపటి నుంచి రామచంద్రపురం, తుని, కొత్తపేట ప్రాంతాల్లో ట్రూనాట్ టెస్టులు నిర్వహించనున్నాము. ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కూడా నిర్వహించేందుకి చర్యలు తీసుకుంటున్నాము. కోవిడ్ చికిత్సనందిస్తోన్న అన్ని ఆస్పత్రుల్లోను ఆక్సిజన్ సమృద్ధిగా ఉంది. ఆక్సిజన్ వృధా కాకుండా ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి. కోలుకున్న బాధితులు ఇళ్లకు వెళ్లే పరిస్థితి లేకపోతే కోవిడ్ కేర్ సెంటర్ లకు వెళ్లాలి.. ఆస్పత్రుల్లోనే ఉంటామనడం సరికాదు.. కోవిడ్ స్పెషల్ ఆఫీసర్ ఆనంద్ నేతృత్వంలో జిల్లా ఉన్నతాధికారులంతా అప్రమత్తంగా ఉన్నాము. ప్రజలెవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదు.. అనసవరంగా బయట తిరగకుండా సహకరించండి అని పేర్కొన్నారు.