AP Elections 2024: చూసైనా మారండి..! 104 ఏళ్ల తాతయ్య.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections 2024: కొన్ని ప్రాంతాల్లో నమోదు అవుతోన్న పోలింగ్ శాతం ఆందోళనకు గురిచేస్తోంది.. పెద్ద ఎత్తున యువ ఓటర్లు పుట్టుకొస్తున్నా.. పోలింగ్ బూత్‌కు వచ్చి ఓటేసేవారి సంఖ్య తగ్గిపోతోంది.. ముఖ్యంగా పట్టణాల్లో ఇది మరీ ఎక్కువగా ఉన్నట్టు నమోదు అవుతోన్న పోలింగ్ శాతాన్ని బట్టి తెలుస్తుంటుంది.. అయితే, ఓ తాతగారిని చూసి అంతా నేర్చుకోవాలి.. 104 ఏళ్ల వయస్సులోనూ ఓటు హక్కు వినియోగించుకుని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.. 18వ సారి ఓటు హక్కు వినియోగించుకుని తన ప్రత్యేకత చాటుకున్నాడు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన వ్యాపారవేత్త రొంగల రాముడు. వయోవృద్ధులకు కేటాయించిన హోమ్ ఓటింగ్ ద్వారా 104 ఏళ్ల రాముడు.. 18వ సారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిడదవోలులోనే తన స్వగృహానికి పోలింగ్ అధికారులు బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చారు. దీంతో రాముడు ఇంటి నుంచి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Read Also: NTR 31 : ఎన్టీఆర్, నీల్ మూవీపై క్రేజీ న్యూస్ వైరల్..?
Also Read
- 100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
- LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
- 42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
- India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
అయితే, ఈ మధ్యే.. ఓటింగ్ ఎట్ హోమ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఎన్నికల కమిషన్.. వయోవృద్ధులు అంటే 85 ఏళ్లు పైబడినవారికి, ఇతర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారికి ఈ అవకాశం ఇచ్చింది ఈసీ.. అయితే, ఏకంగా 18 సార్లు ఓటు హక్కు వినియోగించుకుని.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు రొంగల రాముడు అనే తాతయ్య. ఇప్పటికైనా కదలండి యువత.. ఓటు హక్కు వినియోగించుకొండి.. నచ్చిన నాయకుడికి ఓటు వేసి మెచ్చిన ప్రభుత్వాన్ని తెచ్చుకొండి. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఓటు ఎట్ హోం నిన్నటి నుంచే ప్రారంభమైంది.. ఇక, ఈ నెల 13వ తేదీన పోలింగ్ జరగనుండగా.. వచ్చే నెల ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్న విషయం విదితమే.
తాజావార్తలు
-
Suriya – Mani Ratnam : 8ఏళ్ల క్రితం నాటి కథతో మణిరత్నం దర్శకత్వంలో సూర్య?
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
LPG Cylinder Shortage: హోర్ముజ్ సంక్షోభం.. భారత్‌లో ఎల్పీజీ కొరతపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి..
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
India XI vs World XI: ప్రపంచ దిగ్గజాలంత ఓ వైపు.. టీమిండియా ఒక్కటే మరోవైపు.. ఫ్యాన్స్‌కు కేక పుట్టించే బిగ్ మ్యాచ్!
ట్రెండింగ్
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!