మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఓక్సాకా తీరానికి సమీపంలో 5.65 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
6.1 Earthquake Hits Turkey: పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బలికెసిర్ ప్రావిన్సులోని సిందిర్గిలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన ఇస్తాంబుల్, ఇజ్మీర్ సహా పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 4.6…
హర్యానాలో భూకంపం సంభవించింది. ఝజ్జర్‌లో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్న సమయంలో 3.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఎన్‌సీఎస్) తెలిపింది.
Russia: రష్యా దేశ తూర్పు ప్రాంతమైన కురిల్ దీవుల్లో ఆదివారం 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి మొదటగా సునామీ హెచ్చరిక జారీ చేసిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ, అనంతరం అలల పొడవు తక్కువగా ఉందని పేర్కొంటూ హెచ్చరికను ఉపసంహరించుకుంది. భూకంప ప్రభావంతో తీర ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భూకంపం తర్వాత పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా ఎటువంటి సునామీ ముప్పు లేదని…
రష్యాలోని ఫార్ ఈస్టర్న్ ప్రాంతమైన కమ్చట్కాలో తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.7గా నమోదైంది. యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్‌జిఎస్) ప్రకారం, సముద్రం లోతులో భూకంపం సంభవించింది. ఆ తర్వాత జపాన్, యుఎస్ ఏజెన్సీలు సునామీ హెచ్చరిక (సునామీ వాచ్) జారీ చేశాయి. యుఎస్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం లోతులో (సుమారు 19.3 కిలోమీటర్లు) సంభవించింది. దీని వలన ఉపరితలంపై బలమైన ప్రకంపనలు, సునామీ వచ్చే అవకాశం పెరిగింది.వార్తా…
Earthquake: మంగళవారం (జులై 22) ఉదయం ఢిల్లీ – ఎన్సీఆర్ ప్రాంతాన్ని స్వల్పంగా భూకంపం కంపించింది. స్వల్పంగా కంపనలు గుర్తించినప్పటికీ, ఎలాంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. భారత జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (National Centre for Seismology) విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఉదయం 6 గంటలకు 3.2 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఈ భూకంపానికి హర్యానాలోని ఫరిదాబాద్ ప్రాంతం కేంద్రంగా నమోదైంది. Delivery Agent Urinates: లిఫ్ట్‌లో…
Earthquake: గుజరాత్ రాష్ట్రంలోని కచ్చ్ జిల్లాలో మరోసారి భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 4.0గా నమోదైంది. శనివారం రాత్రి 9:47 గంటలకు భూమి కంపించింది. ఈ భూకంపం కేంద్రం ఖావడా ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఈస్ట్-సౌత్ ఈస్ట్ దిశగా ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. అయితే ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం లేదు. అయితే,Parliament Monsoon Sessions: నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..…
Earthquake: ఇజ్రాయెల్ దాడులతో సతమతమవుతున్న ఇరాన్లో మరోసారి భూకంపం సంభవించింది. సెమ్నాన్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూమి కంపించింది. 10కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
రష్యాలో భూకంపం సంభవించింది. కురిల్ దీవుల్లో ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.5గా నమోదైంది. 12 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) తెలిపింది.
టర్కీ, ఈజిప్ట్, సిరియా, గ్రీస్ దేశాల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదైంది. టర్కీ, ఈజిప్ట్, సిరియా అంతటా ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.