పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8గా నమోదైంది. శనివారం మధ్యాహ్నం 1 ఒంటి గంటకు వచ్చిన భూప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు రాలేదు.
Earthquake: శుక్రవారం నేపాల్‌లో 5.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. నేపాల్‌లో వచ్చిన భూకంపం ప్రభావంతో హిమాలయాలను అనుకుని ఉన్న రాష్ట్రాల్లో, ఢిల్లీలో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం రాత్రి 7.52 నిమిషాలకు సంభవించింది, దాని కేంద్రం 20 కి.మీ లోతులో ఉనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇటీవల మయన్మార్, బ్యాంకాక్, చైనా వంటి దేశాల్లో భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మయన్మార్, బ్యాంకాక్ అతలాకుతలం అయ్యాయి. పదుల సంఖ్యలో భవనాలు నేలమట్టమయ్యాయి. వందలాది మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మరువక ముందే పాకిస్తాన్ లో భూకంపం చోటుచేసుకుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో సోమవారం 4.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. బలూచిస్తాన్‌లోని ఉతల్ నగరానికి తూర్పు-ఆగ్నేయంగా 65 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని USGS…
Myanmar Earthquake: గత వారంలో మయన్మార్‌లో సంభవించిన శక్తివంతమైన భూకంపం ఆ దేశాన్ని నాశనం చేసింది. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లోని పలు భవనాలు కుప్పకూలాయి. ముఖ్యంగా మయన్మార్ తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు, 1700 మంది చనిపోయారు, ఇంకా శిథిలాల కింద వేల మంది ఉన్నారు. వీరి కోసం రెస్క్యూ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, భూకంపం వల్ల మొత్తం మృతుల సంఖ్య 10,000 దాటే అవకాశం ఉందని…
టోంగా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే తెలిపింది. పంగైకి ఆగ్నేయంగా 90 కిలోమీటర్ల దూరంలో.. 10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని అమెరికా ఏజెన్సీ తెలిపింది.
Operation Brahma: భూకంపం ధాటికి తీవ్రంగా నష్టపోయిన మయన్మార్‌కి ఇండియా ఆపన్నహస్తం అందిస్తోంది. శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం రావడంతో ఆ దేశం తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటి వరకు 1000 మందికి పైగా ప్రజలు మరణించారు. అయితే, భూకంప బాధిత మయన్మార్‌కి సాయం చేసేందుకు భారత్ ‘‘ఆపరేషన్ బ్రహ్మ’’ని ప్రారంభించింది. శనివారం ఆ దేశానికి 15 టన్నుల సహాయ సామాగ్రిని పంపిణీ చేసింది. భారత వైమానిక దళం(ఐఎంఎఫ్) C130J సైనిక రవాణా విమానంలో హిండన్…
Myanmar Earthquake: భారీ భూకంపంతో మయన్మార్, థాయ్‌లాండ్‌లో భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 1000ని దాటింది. భవనాల శిథిలాల కింద చాలా మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, శనివారం మధ్యాహ్నం మరోసారి మయన్మార్‌ని భూకంపం వణించింది. 4.7 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. భూకంప లోతు 10 కి.మీగా ఉంది. దీనికి ముందు శనివారం మధ్యాహ్నం 3.8 తీవ్రతతో భూకంపం వచ్చింది.
మయన్మార్, థాయిలాండ్ శక్తివంతమైన భూకంపం నుంచి ఇంకా తేరుకోకముందే కొన్ని గంటల వ్యవధిలోనే శనివారం ఉదయం ఆప్ఘనిస్థాన్‌లో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేల్‌పై 4.7 తీవ్రత నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఉదయం 5.16 గంటల ప్రాంతంలో భూప్రకంపం చోటుచేసుకుంది.
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. సౌత్ ఐలాండ్ పశ్చిమ తీరంలో ఈ ఉదయం భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై 6.5గా నమోదైంది. అయితే భారీగా భూప్రకంపనలు చోటుచేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. రివర్టన్ తీరంలో మంగళవారం ఉదయం శక్తివంతమైన భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం… ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.5 నుంచి 6.8 మధ్య ఉన్నట్లుగా పేర్కొంది. భూకంప కేంద్రం భూమికి పశ్చిమ నైరుతి దిశలో 159 కిలోమీటర్ల దూరంలో…
మయన్మార్-భారత్ సరిహద్దులో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 5.8 గా నమోదైంది. భూకంపం 10 కి.మీ (6.21 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. అయితే ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. భూప్రకంపనలతో అధికారులు అప్రమత్తం అయ్యారు.