రష్యా, ఇండోనేషియాలో భారీ భూకంపాలు సంభవించాయి. రష్యాలో తీవ్రత 7.8గా.. ఇండోనేషియాలో 6.1గా తీవ్రత నమోదైంది. శుక్రవారం తెల్లవారుజామున రష్యాలోని కమ్చట్కాలో భూ కంపం సంభవించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
భూప్రకంపనలు అంటే ఎవరైనా హడలెత్తిపోతారు. బతుకు జీవుడా అంటూ పరుగులు పెడతారు. ఏ ఒక్కరికైనా భయాందోళనలు సహజం. కానీ అస్సాంలోని నర్సులు మాత్రం వృత్తికి తగినట్టుగా తమ బాధ్యతలు నెరవేర్చి శెభాష్ అనిపించుకుంటున్నారు.
Earthquake: అస్సాంలోని గువాహటిలో 5.8 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ భూకంపం వల్ల ఉత్తర బెంగాల్, పొరుగున ఉన్న భూటాన్‌లో కూడా బలమైన ప్రకంపనలు నమోదయ్యాయి. ఈ ఘటనతో ప్రజలు భయాందోళనలకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కేవలం కొద్ది రోజుల క్రితమే.. అంటే సెప్టెంబర్ 2న అస్సాంలోని సోనిత్‌పూర్‌లో 3.5 తీవ్రతతో కూడిన మరో భూకంపం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది సంభవించింది. రోజూ సూర్య నమస్కారం చెయ్యడంతో ఆరోగ్యం, ఆనందం,…
ఆప్ఘనిస్థాన్‌ను మరోసారి భూకంపం వణికించింది. మూడు రోజుల క్రితం వచ్చిన భారీ భూకంపం నుంచే ఇంకా తేరుకోలేదు. తాజాగా గురువారం కూడా మరోసారి భూకంపం హడలెత్తించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.8గా నమోదైంది. 135 కి.మీ లోతులో ఈ భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.
ఆప్ఘనిస్థాన్‌ను భారీ భూకంపం అతలాకుతలం చేసింది. అర్ధరాత్రి వచ్చిన భూకంపంతో తాలిబన్ల దేశం వణికిపోయింది. రిక్టర్ స్కేల్‌పై 6.0తో భూకంపం వచ్చింది. దీంతో ఎటుచూసినా శవాల దిబ్బగా మారిపోయింది. ఇ
ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0 గా నమోదైంది. దాని ప్రకంపనలు భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా ఢిల్లీ-NCRలో సంభవించాయి. దీనితో పాటు, పాకిస్తాన్లో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. బలమైన భూకంపం కారణంగా కనీసం 9 మంది మరణించారని, 15 మంది గాయపడ్డారని ఆఫ్ఘన్ నంగర్హార్ ప్రజారోగ్య శాఖ ప్రతినిధి నకిబుల్లా రహీమి రాయిటర్స్‌తో తెలిపారు. Also Read:Ganesh…
Earthquake: దక్షిణ అమెరికాలోని డ్రేక్ పాశేజ్ ప్రాంతంలో గురువారం (అక్కడి స్థానిక సమయం ప్రకారం) భారీ భూకంపం సంభవించింది. అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం, ఈ భూకంపం తీవ్రత తొలుత 8గా నమోదు కాగా, తరువాత దాన్ని 7.5కి సవరించారు. రిక్టర్ స్కేల్‌పై ఇలాంటి భారీ తీవ్రత గల భూకంపం సంభవించినప్పుడు సాధారణంగా సునామీ హెచ్చరిక జారీ చేస్తారు. అయితే, ఈసారి అమెరికా సునామీ వార్నింగ్ సిస్టమ్ ఎలాంటి హెచ్చరిక ఇవ్వలేదు. కేవలం చిలీ ప్రభుత్వం…
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. ఓక్సాకా తీరానికి సమీపంలో 5.65 తీవ్రతతో ఈ భూకంపం సంభవించింది. ఈ భూకంపం 10 కి.మీ (6.2 మైళ్ళు) లోతులో సంభవించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది.
6.1 Earthquake Hits Turkey: పశ్చిమ టర్కీలో భారీ భూకంపం సంభవించింది. బలికెసిర్ ప్రావిన్సులోని సిందిర్గిలో 6.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఆదివారం 6.1 తీవ్రతతో భూకంపం సంభవించిందని టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ (AFAD) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పర్యాటక ప్రాంతాలైన ఇస్తాంబుల్, ఇజ్మీర్ సహా పశ్చిమాన ఉన్న అనేక నగరాల్లో భూకంపం సంభవించిందని అధికారులు తెలిపారు. రాత్రి 7:53 గంటలకు భూకంపం సంభవించిందని అధికారులు పేర్కొన్నారు. కొన్ని నిమిషాల తర్వాత మరోసారి 4.6…