Russia: ఓ వైపు 7.0 భూకంపం.. మరోవైపు 600 ఏళ్ల తర్వాత క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం..!
- కురిల్ దీవుల్లో 7.0 తీవ్రతతో భూకంపం.
- కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రషెనినికోవ్ అగ్ని పర్వతం విస్ఫోటనం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia: రష్యా దేశ తూర్పు ప్రాంతమైన కురిల్ దీవుల్లో ఆదివారం 7.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపానికి సంబంధించి మొదటగా సునామీ హెచ్చరిక జారీ చేసిన రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ, అనంతరం అలల పొడవు తక్కువగా ఉందని పేర్కొంటూ హెచ్చరికను ఉపసంహరించుకుంది. భూకంప ప్రభావంతో తీర ప్రాంతాల వద్ద ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఈ భూకంపం తర్వాత పసిఫిక్ సునామీ హెచ్చరిక వ్యవస్థ కూడా ఎటువంటి సునామీ ముప్పు లేదని స్పష్టం చేసింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ఈ భూకంప తీవ్రతను 7.0గా నమోదు చేసింది.
Baby Movie Team : ఆనంద్, వైష్ణవికి వారితో గొడవ.. సద్దుమణిగినట్టేనా..?
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మరోవైపు, ఈ భూకంపం జరిగిన అదే రాత్రి కమ్చట్కా ద్వీపకల్పంలోని క్రషెనినికోవ్ అగ్ని పర్వతం 600 సంవత్సరాల తర్వాత మొదటిసారి విస్ఫోటనం సంభవించింది. నివేదికల సమాచారం ప్రకారం, ఈ అగ్ని పర్వతం చివరిసారిగా 1463 ప్రాంతంలో సంభవించిందని వారు పేర్కొన్నారు. కమ్చట్కా వాల్కానిక్ ఎరప్షన్ రెస్పాన్స్ టీం అధిపతి ఒల్గా గిరినా మాట్లాడుతూ.. క్రషెనినికోవ్ అగ్ని పర్వతం చారిత్రకంగా ధృవీకరించబడిన మొదటి విస్ఫోటనం అని అన్నారు.
China Humanoid Robot: వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చైనీస్ రోబో.. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్
అగ్ని పర్వతం విస్ఫోటనం కారణంగా 6,000 మీటర్ల (3.7 మైళ్లు) ఎత్తులో బూడిద మేఘం ఏర్పడినట్లు కమ్చట్కాలోని అత్యవసర సేవల శాఖ ప్రకటించింది. ఈ బూడిద మేఘం పసిఫిక్ మహాసముద్రం వైపు తూర్పుగా కదులుతోంది. దాని మార్గంలో ఎటువంటి జనావాసాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఈ అగ్ని పర్వతం విస్ఫోటనానికి ‘ఆరెంజ్ ఎవియేషన్ కోడ్’ను అందించారు. ఇది విమానాల రాకపోకలకు పెరిగిన ముప్పును సూచిస్తుంది. క్రషెనినికోవ్ అగ్ని పర్వతం ఎత్తు 1,856 మీటర్లు.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!