Partial Solar Eclipse: అక్టోబర్ 25న పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతోంది. యూరప్, పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికాల్లో ఈ ఖగోళ అద్భుతం కనువిందు చేయబోతోంది. సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు రావడంతో గ్రహణం ఏర్పడుతుంది. 25 మధ్యాహ్నం ఇండియాలో సూర్యగ్రహణం కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ గ్రహణాన్ని వీక్షించవచ్చు. భారతదేశంలో తూర్పు ప్రాంత నగరమైన కోల్‌కతా ప్రజలు తక్కువ సమయం పాటు ఈ సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. అయితే ఉత్తర, పశ్చిమ భారతదేశ ప్రాంతాలు ఈ సూర్యగ్రహణాన్ని స్పష్టంగా చూడవచ్చు. ఈశాన్య ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపించడు.
పాక్షిక సూర్యగ్రహణం అక్టోబర్ 25న ఉదయం 8.58 నుంచి మధ్యాహ్నం 1.02 వరకు ఉంటుంది. దీని తర్వాత మార్చి 29,2025లో మరో పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది భారత్ లో కనిపించదు. మళ్లీ పదేళ్ల తరువాత ఏర్పడే సూర్యగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. నవంబర్ 3,2032న ఏర్పడే పాక్షిక గ్రహణాన్ని చూడవచ్చు.
Read Also: Shashi Tharoor: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై శశిథరూర్ సంచలన వ్యాఖ్యలు
సూర్య గ్రహణాల రకాలు:
నాసా ప్రకారం సూర్య గ్రహణాలను నాలుగు రకాలుగా వర్గీకరించారు. సంపూర్ణ, వార్షిక, పాక్షిక సూర్యగ్రహణం, హైబ్రీడ్ సూర్యగ్రహణాలుగా విభజించారు.
1. సూర్యుడు, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి పూర్తిగా సూర్యుడిని నిరోధించినప్పుడు సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడుతుంది.
2. వార్షిక సూర్యగ్రహణం(కంకణాకార సూర్యగ్రహణం): భూమి, సూర్యుడికి మధ్య చంద్రులు చాలా దూరం ఉన్న సమయంలో, అతి సమీపంలో ఉన్నప్పుడు ఈ రకమైన గ్రహణం ఏర్పడుతుంది. చంద్రుడు, సూర్యుడిని పూర్తిగా కవర్ చేయకపోవడంతో కంకణాకృతిలో సూర్యుడు కనిపిస్తాడు.
3. సూర్యుడు, భూమి మధ్యగా చంద్రుడు వెళ్తున్నప్పుడు పాక్షిక సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖపై పూర్తిగా లేని సమయంలో సూర్యుడి కొంతభాగాన్ని మాత్రమే చంద్రుడు కవర్ చేస్తాడు. దీంతో అర్ధచంద్రాకారం రూపంలో గ్రహణం కనిపిస్తుంది.
4. హైబ్రీడ్ సూర్యగ్రహనం భూమి ఉపరితలం వక్రంగా ఉన్నప్పుడు.. చంద్రుడి నీడ ప్రపంచవ్యాప్తంగా కదులుతున్న సమయంలో ఈ రకమైన గ్రహణం ఏర్పడుతుంది.