Bigg Boss 9 :బిగ్ బాస్ 9 ఫుల్ రచ్చ రచ్చగా నడుస్తోంది. మరి ముఖ్యంగా వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత హౌస్ లో చాలా రకాల గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీ ల తర్వాత దమ్ము శ్రీజ సడన్ గా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే గత వారం దమ్ము శ్రీజతో పాటు భరణి ని హౌస్ లోకి రీఎంట్రీ ఇప్పించారు. నామినేషన్స్ లో దువ్వాడ మాధురికి శ్రీజ కౌంటర్…
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అయితే... అవి అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కాదు. అలాంటి పోరు ఉంటే... అది షరా మామూలే. కానీ... ఇక్కడ మాత్రం కాస్త తేడాగా ఉందట. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేంద్రంగా నడుస్తున్న వ్యవహారాలు ఆసక్తికరంగా మారుతున్నాయని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్నారు దువ్వాడ.
తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తాము మరలా అధికారంలోకి వస్తాం అని, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్పష్టంగా చెప్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారన్నారు. అధికారమనేది తాత్కాలికం అని, తప్పుడు కేసులు…
శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు శనివారం పోలీసులు 41ఏ నోటీసులు జారీ చేశారు. అక్కవరం గ్రామం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
అతి సర్వత్రా… అన్నది ఆ ఎమ్మెల్సీ విషయంలో ప్రాక్టికల్‌గా నిరూపితం అవుతోందా? ఓ పద్ధతి ప్రకారం ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం అవుతోందా? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, పవర్ పోయాక మరో రూపంలో దూకుడు ప్రదర్శించి జనం నోళ్ళలో విపరీతంగా నానుతున్న ఆ లీడర్‌కు ఇప్పుడు సొంత పార్టీవాళ్ళే సపోర్ట్ చేసే పరిస్థితి లేదా? ఎవరా ఎమ్మెల్సీ? ఏంటాయన జిల్ జిల్ కీ కహానీ? సిక్కోలు పాలిటిక్స్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ది డిఫరెంట్ స్టైల్.…
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి తిరుమల పోటీసులు జారీ చేశారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. ఇటీవల తిరుమల కొండపై రీల్స్ చేసిన వివాదంలో టీటీడీ విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేశారు.
ప్రీవెడ్డింగ్ షూట్ విషయంలో హాట్ కామెంట్లు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్.. మాధురితో కలిసిఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. తిరుమల ఇష్యూతో రాజకీయంగా ఇరికించాలని భావించారు. తిరుమల కొండపై ఎలాంటి తప్పు , అపచారం చేయలేదని స్పష్టం చేశారు.. నాలుగు రోజులు తరువాత మాపై కేసులు పెట్టారు. వ్యక్తిగత అంశాలను పార్టీ పట్టించుకోదు. పార్టీకి నేనే చెప్పాను.. వైసీపీ నన్ను సస్పెండ్ చేసినా పర్వాలేదన్నారు.. పార్టీకి వ్యక్తి గత అంశాలను ముడిపెట్టవదన్నారు దువ్వాడ..
మాది అపవిత్రబంధం కాదు.. పవిత్రబంధం.. విడాకులు తీసుకున్నాక ఇద్దరం కలసి ఉంటాం అంటున్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. కొండమీద రీల్స్ చేయలేదు. ఒక్కఫొటో అయినా ఉందా..? నేను ఫొటోగ్రాపర్స్ ని తీసుకువెళ్లలేదన్నారు మాధురి.. వద్దని చెబుతున్నా.. కొందరు నా వెంటపడి వీడియోలు, ఫొటోలు తీశారన్నారు.. అయితే, మాది అపవిత్ర బంధం కాదు.. పవిత్రబంధంగా చెప్పుకొచ్చారు..
తిరుమలలోని దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాధురి ఫోటో షూట్ చేశారు. మాడవీధులు, పుష్కరిణి దగ్గర దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఫోటోషూట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ డైరెక్షన్లో మాధురి యాక్షన్ చేశారు.
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి.. తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు.. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్న వేళ.. దువ్వాడ మాధురితో కలిసి తిరుమలకు వచ్చారు దువ్వాడ శ్రీనివాస్.. నిన్నటికి నిన్నే దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఓ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై.. తన ఇంటి ఆవరణలో చక్కర్లు కొచ్చిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.