ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. మాధురి నుంచి దువ్వాడ శ్రీనివాస్‌కు ప్రాణహాని ఉందని ఆరోపించారు. దువ్వాడ శ్రీనివాస్ నూతన ఇంటికి గత రాత్రి మాధురి చేరుకుందంటూ వ్యాఖ్యానించారు.
Duvvada Srinivas: దువ్వాడ వాణి రోజుకో రకంగా మాటాడుతున్నారు అని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. పిల్లలను ఇంటిపైకి పంపించారు.. టెక్కలి వదిలి వెళ్లాలని మాట్లాడారు.. ఆస్తులపై మాట్లాడారు.. తండ్రిగా నా బాధ్యతను నిర్వహిస్తా.. ఒకవైపు పెద్దమనుషులను పంపిస్తూ..
Duvvada Vani: శ్రీకాకుళం జిల్లాలో టెక్కలిలో గత పది రోజులుగా దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారంపై నిరసన చేపట్టిన జడ్పీటీసీ దువ్వాడ వాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. తమ పిల్లల కోసమే దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఉంటామని తెలిపింది.
Best Wife – Best Husband: గత కొద్దిరోజులుగా మీడియాలో పెండింగ్ టాపిక్స్ ఏమిటి అంటే లావణ్య- రాజ్ తరుణ్ ఇష్యూ తరువాత నాగచైతన్య – శోభిత ఎంగేజ్మెంట్ . ఇప్పుడు దువ్వాడ శీను మాధురి అడల్టరీ అనే వ్యవహారాలు. మధ్యలో వేణు స్వామి- నాగచైతన్య శోభిత విడిపోతారు అంటూ చెప్పిన జాతకం మీద మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా ట్రోల్స్ వచ్చాయి. తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అయితే ఒక అడుగు ముందుకేసి…
రాష్ట్రవ్యాప్తంగా చర్చగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. ఇప్పటికే రోజుకో మలుపు.. పూటకో ట్విస్ట్ ఈ కేసులో వెలుగు చూస్తుండగా.. ఇప్పుడు.. దివ్వెల మాధురిపై కేసు నమోదు చేశారు పోలీసులు..
Duvvada Srinivas: శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందు మూడో రోజు హైడ్రామా కొనసాగుతుంది. దువ్వాడ ఇంటి ముందు రాత్రిపూట కార్ షెడ్ లోనే భార్య వాణి, కుమార్తె హైందవి పడుకున్నారు.
ఆస్తులు లేని వ్యక్తిని ప్రేమించి, తల్లిదండ్రులను ఎదిరించి పెళ్లి చేసుకున్నాను.. కానీ, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు అన్నారు టెక్కలి జెడ్పీటీసీ సభ్యురాలు.. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణి..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు రచ్చగా మారింది.. దువ్వాడ శ్రీనివాస్‌కు దివ్వల మాధురి అనే మహిళతో ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ భార్య వాణి చేసిన ఆరోపణలపై అదే రేంజ్‌లో స్పందించారు దివ్వల మాధురి.. ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆమె.. నన్ను అనవసరంగా బయటకు లాగొద్దు అని వార్నింగ్ ఇచ్చారు.. శ్రీనివాస్ భార్య తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం…
వాలంటీర్లు రాజీనామాలు చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పుడు రాజీనామాలు చేసిన వారినే జూన్ 5వ తేదీ నుండి మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని తెలిపారు.. రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకొని ప్రచారం చేయాలన్నారు.. అలాంటి వారినే మళ్లీ విధుల్లోకి తీసుకుంటామని స్పష్టం చేశారు దువ్వాడ శ్రీనివాస్