Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్ మిస్సింగ్.. పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారంటూ అభిమానులు ఆందోళనలు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Duvvada Srinivas: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నమోదైన కేసుల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వెళ్తున్నట్లు చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ అనూహ్యంగా కనిపించకపోవడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ ఘటనతో ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం ప్రకారం.. కేసులకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు బయలుదేరినట్లు తెలిపారు. అయితే బయలుదేరి రెండు గంటలకు పైగా గడిచినా ఆయన గమ్యస్థానానికి చేరుకోలేదు. దీంతో ఆయన ఎక్కడ ఉన్నారనే అంశంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దువ్వాడతో సన్నిహితంగా ఉన్న మాధురి స్పందించారు. దువ్వాడ శ్రీనివాస్ను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకుని ఉండవచ్చని ఆమె ఆరోపించారు. ఆయన ఫోన్ కూడా అందుబాటులో లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయని అన్నారు.
Also Read
- CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
- AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
- Story Board: ధరల మంట: రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణం.. పెరిగిన ధరలతో బతికేదెలా..?
- OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
అయితే ఈ ఆరోపణలను కొత్తూరు పోలీసులు ఖండించారు. దువ్వాడ శ్రీనివాస్ తమ పోలీస్ స్టేషన్కు రాలేదని, ఆయన గల్లంతు వ్యవహారంతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో దువ్వాడ ఎక్కడ ఉన్నారన్న ప్రశ్నకు ఇంకా సమాధానం లభించలేదు. దువ్వాడ కనిపించకపోవడంతో ఆయన అనుచరులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో ముందు జాగ్రత్తగా మధురిని హౌస్ అరెస్ట్ చేశారు. ఇదిలా ఉండగా, పోలీస్ స్టేషన్కు వెళ్లే ముందు దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో చేసిన వ్యాఖ్యలు, అనంతరం ఆయన కనిపించకపోవడం మరిన్ని చర్చలకు దారితీస్తోంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..